Rahul Dravid : కోహ్లి, రోహిత్‌ల‌ను ఆడించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దే.. మా ల‌క్ష్యం ఏంటంటే..? రాహుల్ ద్ర‌విడ్‌

సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లు లేకుండా బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో ఓడిపోయింది.

Rahul Dravid

Rahul Dravid defends team selection : సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లు లేకుండా బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో ఓడిపోయింది. వీరిద్ద‌రికి విశ్రాంతి ఇవ్వ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంతో స‌మ‌యం లేద‌ని, ఇలాంటి స‌మ‌యంలో ఈ ప్ర‌యోగాలు ఎందుకు అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. కాగా.. ప్ర‌యోగాలు చేయ‌డంపై భార‌త హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) స్పందించారు.

కొంత మంది ఆట‌గాళ్లు గాయాల‌తో బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో ఉన్నారన్నాడు. ఆసియా క‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్ కోసం జ‌ట్టును స‌న్న‌ద్దం చేసుకోవ‌డానికి ఇదే చివ‌రి అవ‌కాశమ‌ని చెప్పాడు. ఎన్‌సీఏలో ఉండి వ‌చ్చిన వారిని ఎక్కువ మ్యాచులు ఆడించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపాడు. ఎన్‌సీఏలో ఉన్న కొంత‌మంది ఆసియాక‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్ నాటికి ఫిట్‌గా ఉంటే ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుందన్నాడు.

Stuart Broad : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్ బాధితుడు.. ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌

మెగా టోర్నీల‌ను దృష్టిలో పెట్టుకునే జ‌ట్టును స‌న్న‌ద్దం చేస్తుంటామ‌ని చెప్పుకొచ్చాడు. ఏదో ఒక మ్యాచులోనో, ఒక సిరీస్‌లో ఓట‌మి ఎదురైనంత మాత్ర‌న వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో కొత్త కుర్రాళ్ల‌ను ఆడించాల్సిన అవ‌స‌రం రావొచ్చున‌ని, వారికి త‌గినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేందుకు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు.

ఇక ఆసియా క‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇలాంటి సిరీసుల్లో రెండు లేదా మూడు మ్యాచులు ఆడి విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు కొత్త‌గా నిరూపించుకోవాల్సింది ఏమీ లేద‌న్నారు. బ‌య‌ట నుంచి వ‌చ్చే అభిప్రాయాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేద‌న్నాడు. ఓట‌మి బాధించింద‌ని, పిచ్ మాత్రం క‌ఠినంగానే ఉంద‌న్నాడు. 230 నుంచి 240 ప‌రుగులు చేసిన ఫ‌లితం వేరేలా ఉండే అవ‌కాశం ఉండేద‌న్నాడు.

MS Dhoni : దొంగచాటుగా ధోని వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. ఫ్యాన్స్ ఫైర్‌.. ఇలా చేయ‌డం ఏం బాలేదు

ట్రెండింగ్ వార్తలు