Rajasthan : పరీక్షకు హాజరైన యువతి స్లీవ్‌లు కత్తిరించిన సెక్యూరిటీ గార్డు..మండిపడ్డ మహిళా కమిషన్

రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ యువతి డ్రెస్ స్లీవ్స్ ను సెక్యూరిటీ గార్డు కత్తెరతో కట్ చేశాడు. దీనిపై మహిళా కమిషన్ మండిపడింది.

sleeves of girl candidates sliced during exam : పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పలు నిబంధనలుంటాయనే విషయం తెలిసిందే. కానీ దీన్ని ఆసరా చేసుకుని కొన్ని అత్యుత్సాహమైన పనులు చేస్తుంటారు. అస్సాంలో ఓ విద్యార్దిని షార్ట్ వేసుకుందని పరీక్ష రాయింటానికి వీల్లేదన్నారు నిర్వాహకులు. దీంతో ఆమె ఓ కర్టెన్ చుట్టుకుని పరిక్ష రాసింది. నిబంధనలు ఉండాల్సిందే కానీ రాజస్థాన్ లో పోటీ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని విషయంలో ఓ మగ సెక్యూరిటీ గార్డు చేసిన పనికి జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్ష బుధవారం (అక్టోబర్ 28,2021) జరిగింది. దీంట్లో భాగంగా బికనీర్‌లోని ఒక పరీక్షా కేంద్రానికి పరీక్ష రాయటానికి ఓ విద్యార్థిని హాజరైంది. ఆమెను లోపలికి పంపించేముందు ఆమె వేసుకున్న డ్రెస్ పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఆమె పొడుగు చేతులున్న టాప్ వేసుకుని వచ్చింది. దీంతో ఆమె ధరించి టాప్ స్లీవ్స్‌ను సెక్యూరిటీ గార్డు కత్తెరతో కత్తిరించాడు. అదికాస్తా మీడియాలో వచ్చింది.

Read more : Short Dress Problem : షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాయటానికి వీల్లేదన్న అధికారులు..ఆమె ఏం చేసిందంటే..

మీడియాలో వచ్చిన ఈ ఘటనపై ఓ మహిళ స్పందిస్తు..వెంటనే జాతీయ మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను పరిశీలించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పరీక్షా కేంద్రం వద్ద మహిళా అభ్యర్థులను తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఎందుకు నియమించలేదు? అని ప్రశ్నిస్తు..మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరారు.

కాగా..పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు రాజస్థాన్‌ ప్రభుత్వం కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పొడుగు చేతులున్న షర్టులు ధరించకూడదనీ..పేర్కొంది. ఈ క్రమంలో ఫుల్ హ్యాండ్స్ ఉన్న టాప్ ధరించిన పరీక్షా కేంద్రాలకు వచ్చిన మహిళా అభ్యర్థుల స్లీవ్స్‌ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కత్తెరతో కత్తిరించాడు. ఈ నిబంధన కేవలం మహిళా అభ్యర్థులకే కాకుండా మగవారికి కూడా అదే నిబందనలు అమలు చేసింది.

Read  more : Strange Rule in School : స్కూల్లో వింత రూల్..విద్యార్ధులు టాయిలెట్ వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ కావాలంట!!

దీంట్లో భాగంగా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని వచ్చిన అబ్బాయిలను కూడా అడ్డుకున్నారు నిర్వాహకులు. వారి హాఫ్ హ్యాండ్స్ హర్ట్ వేసుకోవాలి. లేదంటే లోపలికి అనుమతించం అని చెప్పారు. దీంతో అబ్బాయిలు వారి షర్ట్‌ తీసి పరీక్ష రా పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాల్ని అరికట్టటానికి ఇలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని చెబుతున్నారు అధికారులు. కాగా..నిబంధనలు అమలు చేయటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ అమ్మాల విషయంలో పరీక్షా కేంద్రాల వద్ద మహిళా సెక్యూరిటీని పెట్టాలనేది మహిళా కమిషన్ డిమాండ్.

ట్రెండింగ్ వార్తలు