Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ ఆ పాటలో ఉన్న వాళ్లంతా యుక్రెయిన్‌లే.. నాకు తోచిన సహాయం చేశాను..

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''దేశవ్యాప్తంగా ప్రేక్షకులని 'నాటు నాటు' సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ మొత్తం ఉక్రెయిన్ లోనే షూట్ చేశారు. సాంగ్ లో బ్యాగ్రౌండ్ లో ఉన్న డాన్సర్స్ అంతా...

RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా త్వరలో మార్చ్ 25న రిలీజ్ అవ్వనుంది. దీంతో మరోసారి చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అనేక ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా యుక్రెయిన్ లో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచమంతా దీనిపైనే మాట్లాడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఉక్రెయిన్ దేశంలో షూటింగ్ జరుపుకోవడంతో దానికి సంబంధించిన విషయాలతో పాటు, యుక్రెయిన్ ప్రస్తుత పరిస్థితులని, తాను ఉక్రెయిన్స్‌కి సహాయం చేశాను అని రామ్ చరణ్ తెలిపారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై న్యాయ పోరాటం చేస్తాం..

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ”దేశవ్యాప్తంగా ప్రేక్షకులని ‘నాటు నాటు’ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ మొత్తం యుక్రెయిన్ లోనే షూట్ చేశారు. సాంగ్ లో బ్యాగ్రౌండ్ లో ఉన్న డాన్సర్స్ అంతా యుక్రెయిన్‌కి చెందిన వారే. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో యుక్రెయిన్ వాతావరణం, పరిస్థితులు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ సమయంలో ఓ యుక్రెయిన్ వ్యక్తి నాకు అక్కడ సెక్యూరిటీగా ఉన్నాడు. అతడితో ఇప్పటికి కూడా ఫోన్ ద్వారా టచ్ లో ఉన్నాను. ఇటీవల అతడికి ఫోన్ చేసినప్పుడు అతడు యుక్రెయిన్‌లో ఉన్న పరిస్థితులని చెప్పడంతో నా హృదయం బరువెక్కింది. తన 80 ఏళ్ల తండ్రి కూడా తుపాకీ పట్టుకుని యుద్ధంలో పాల్గొన్నట్లు తెలిపాడు. వాళ్లకి నాకు తోచినంత సహాయం చేయాలి అనుకున్నాను. అతడితో పాటు నాకు తెలిసిన మరి కొంతమందికి సాయంగా కొంత డబ్బుని పంపించాను” అని తెలిపారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలకు హైకోర్టులో ఊరట

షూటింగ్‌లో తనకి సపోర్ట్ గా ఉన్న యుక్రెయిన్ వారికి రామ్ చరణ్ సహాయం చేసిన సంగతి తెలియచేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. అభిమానులు రామ్ చరణ్ మంచితనాన్ని పొగుడుతున్నారు. పలువురు నెటిజన్లు ఈ విషయంలో రామ్ చరణ్‌ని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు