Jio Users : జియో యూజర్లకు గుడ్ న్యూస్..రీచార్జీ తేదీ మరిచిపోయారా ? నో ప్రాబ్లమ్

నూతన టెక్నాలజీ ఆవిష్కరణలో ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. తాజాగా...జియో యూజర్లు...రీచార్జీ తేదీ ఎప్పుడు చేసుకోవాలో మరిచిపోయారా ? నో ప్రాబ్లమ్ అంటోంది జియో..

Jio Users Recharge NPCI : కస్టమర్లను ఆకట్టుకోవడానికి సెల్ ఫోన్ కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటిస్తాయనే సంగతి తెలిసిందే. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. దీనివల్ల ఇతర కంపెనీల వైపు వెళ్లరని భావిస్తుంటాయి. టెలికాం రంగంలో జియో ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీ ఆవిష్కరణలో ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. తాజాగా…జియో యూజర్లు…రీచార్జీ తేదీ ఎప్పుడు చేసుకోవాలో మరిచిపోయారా ? నో ప్రాబ్లమ్ అంటోంది జియో.

Read More : Students Food Poison: 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు అస్వస్థత

ఎందుకంటే..కస్టమర్ల కోసం మరో సదుపాయం ముందుకు తీసుకొచ్చామని వెల్లడించింది. యూపీఐ ఆటోపే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే తొలి కంపెనీ కావడం విశేషం. గడువు ముగిసిన ప్రతిసారీ…ఆటోమెటిక్ గా టారిఫ్ ప్లాన్ ను రీచార్జ్ చేసుకొనేందుకు ‘మై జియో’ యాప్ ద్వారా స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్ సెట్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. RBI ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం…రూ. 5 వేలు వరకు కస్టమర్లు తమ యూపీఐ (UPI Pin) కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి కంపెనీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్..రెండు రకాల కస్టమర్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

Read More : PM Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు

యాక్టివేట్ చేసుకోవడం ఇలా : –
‘మై జియో’ యాప్ లాగిన్ కావాలి. అనంతరం మొబైల్ సెక్షన్ ను క్లిక్ చేయాలి.
రీ చార్జీలు, పేమెంట్స్ విభాగంలో జియో ఆటో పే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన ప్లాన్ ను ఎంపిక చేసుకోవాలి.
తర్వాత యూపీఐ ఆప్షన్ ను ఎంచుకుని…ఐడీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు