Sandal : వేసవిలో చర్మాన్ని కాంతి వంతంగా మార్చే గంధం!.

గంధం అనేది సబ్బులు, బ్యూటీ క్రీమ్‌ల తయారీలో ఉపయోగించటం మనం చూస్తూనే ఉన్నాం. ఇది సహజ క్రిమినాశక చర్మసంరక్షణకారిగా పనిచేస్తుంది.

Chandan Mask

Sandal : ఎండాకాలం వచ్చిందంటే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవి సీజన్‌లో చర్మ రక్షణ అనేది చాలా ముఖ్యనమైది. చర్మం తాజాగా, హైడ్రేటెడ్‌గా, కాంతివంతంగా ఉండటానికి కొన్ని శీతలీకరణ పద్దతులు మంచి పరిష్కారాలుగా దోహదపడతాయి. భారతదేశంలోని మతపరమైన ఆచారాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన గంధం…వేసవిలో చర్మానికి మేలు చేసే మంచి ఔషదగుణాలు కలిగిన వాటిలో మేటిగా చెప్పవచ్చు. చర్మానికి గంధాన్ని ఉపయోగించడం ద్వారా వేసవిలో వచ్చే చర్మ సమస్యల నుండి బయటపడవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

చందనం చర్మానికి మంచిదా?

గంధం అనేది సబ్బులు, బ్యూటీ క్రీమ్‌ల తయారీలో ఉపయోగించటం మనం చూస్తూనే ఉన్నాం. ఇది సహజ క్రిమినాశక చర్మసంరక్షణకారిగా పనిచేస్తుంది. మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది, చర్మాన్నిఎండవేడి నుండి కాపాడుతుంది. గంధం పొడి చర్మంపై ముడతలు , వృద్ధాప్య సంకేతాలను తగ్గించటంలో బాగా ఉపకరిస్తుంది. చర్మానికి గంధపు ప్రయోజనాలను కాస్మెటిక్ క్లినిక్‌లలో సెలబ్రిటీ కాస్మోటాలజిస్ట్ & డైరెక్టర్ డాక్టర్ మోనికా కపూర్‌ చక్కగా వివరించారు. డాక్టర్ కపూర్ మాటల్లో గంధంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మం ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. చర్మంలో ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల కలిగే నష్టాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇది దెబ్బతిన్న చర్మ కణజాలాలను నయం చేస్తుంది. గాయాలు, మచ్చలు, నల్ల మచ్చలు, తామర మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మంపై మొటిమలు రాకుండా నిరోధిస్తుంది. గంధంలోని క్రిమినాశక గుణాలు చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తాయి. మొటిమలు, కురుపులు, పుండ్లకు చికిత్స చేయడంలో , అవిమరింత తీవ్రం కాకుండా నిరోధించడంలో ప్రభావవంతంగా గంధం పనిచేస్తుంది.

మెరిసే చర్మం కోసం చందనాన్ని ఉపయోగించే వివిధ మార్గాలు..

1. నిమ్మతో కలిపి చందనం ; జిడ్డు చర్మం కోసం నిమ్మరసంతో ఎర్ర చందనం పొడిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖమంతా అప్లై చేసి కొంత సమయం ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం జిడ్డు తనాన్ని వదిలిపోతుంది. చర్మం కోమలత్వం సంతరించుకుంటుంది.

2. టమోటాతో గంధం ; 1 టేబుల్ స్పూన్ దోసకాయ రసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ టొమాటో రసం, 3 టేబుల్ స్పూన్ గంధపు పొడిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. 25 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎండవేడి కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి నిగారింపు సంతరించుకునేలా చేయటంలో తోడ్పడుతుంది.

3. దోసకాయతో చందనం ; 2 టేబుల్ స్పూన్ల పెరుగు, దోసకాయ రసానికి సమాన మొత్తంలో ఎర్రచందనం పొడిని కలపండి. పేస్ట్ లా తయారు చేసుకుని చర్మం పొడిబారిన ప్రాంతాల్లో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే వదిలేసి ఆరనివ్వాలి. అనంతరం చల్లని నీటితో కడుక్కోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4.గుడ్డు పచ్చసొనతో చందనం ; చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరచడానికి, ముడతలు రాకుండా చూడటానికి 1 గుడ్డు పచ్చసొన, 1 స్పూన్ పెరుగు , 3-4 టేబుల్ స్పూన్ల చందనం పొడిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ చర్మంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మంచి కాంతి వంతంగా మారుతుంది.

ట్రెండింగ్ వార్తలు