Kharif Kandi : ఖరీఫ్ కందికి స్వల్పకాలిక, మధ్యస్వల్పకాలిక రకాల ఎంపిక

కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది.  మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు.

Kandi Cultivation

Kharif Kandi : కందిపంట సాగులో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పప్పుల కొరత తీర్చడంతోపాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఖరీఫ్ కందిని చాలా చోట్ల రైతులు విత్తారు. మరి కొంత మంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. ఈ నేపద్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. సంధ్యా కిషోర్.

READ ALSO : Benda cultivation : బెండసాగులో మేలైన యాజమాన్యం

కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది.  మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు. పైగా మెట్టప్రాంతాల్లో కంది దిగుబడులు నామమాత్రంగా వుండటంతో,  అధికోత్పత్తిని అందించే వివిధ రకాలను ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు.

READ ALSO : Dragon Fruit Cultivation : డ్రాగన్ ఫ్రూట్ సాగుతో మంచి సత్ఫలితాలు

అయితే ఖరీఫ్ కందిని జులై 15 వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే చాలాచోట్ల రైతులు విత్తారు. మరి కొంత మంది విత్తేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఎకరాకు విత్తన యోతాదు, నేలల బట్టి సాళ్ల మధ్య దూరం  ఎన్నుకొని నాటాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం  శాస్త్రవేత్త డా. సంధ్యా కిషోర్.

READ ALSO : Kandi Cultivation : కందిపంట సాగులో విప్లవాత్మక మార్పులు.. సాగులో మెళకువలు

సకాలంలో విత్తడం ఒకఎత్తైతే,  కలుపు నివారణ మరో ఎత్తు. అంతే కాదు పూత, పింద దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి.కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎక‌రాకు 8 -10 క్వింటాళ్ల దిగుబ‌డిని తీయ‌వ‌చ్చు.

ట్రెండింగ్ వార్తలు