Jawan : శంకర్‌ని మించిపోతున్న అట్లీ.. షారుఖ్ సినిమాలో ఒక్క సాంగ్ కోసం 15 కోట్లు ఖర్చు..

షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలోని ఒక పాట కోసం సుమారు 15 కోట్లు ఖర్చు చేశారట.

Jawan : తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా చేస్తున్న మూవీ ‘జవాన్’. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార (Nayanathara), విలన్ గా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) చేస్తుంటే.. దీపికా పదుకొనే, ప్రియమణి, తమిళ్ హీరో విజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని షారుఖ్ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

Kushi : విజయ్, సమంతల ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. తను కనబడిన, వినబడిన..!

కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రివ్యూ అంటూ ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీలోని ‘జిందా బండా’ అనే సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట. ఆగష్టు మొదటి వారంలో ఈ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సాంగ్ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమిళ్ కొరియోగ్రాఫర్ శోభి ఈ సాంగ్ ని దాదాపు 1000 మంది డాన్సర్స్ తో గ్రాండ్ గా డిజైన్ చేశాడట.

Sai Dharam Tej : అభిమానులకు తేజ్ ప్రెస్ నోట్ రిలీజ్.. బ్యానర్స్ విషయంలో జాగ్రత్త వహించండి..

దీంతో ఈ ఒక్క పాటకే సుమారు 15 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ఈ వార్త విన్న నెటిజెన్స్.. అట్లీ శంకర్ ని మించిపోతున్నాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ కేవలం ఒక సాంగ్ కోసమే భారీ ఖర్చు చేస్తుంటాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ 250 కోట్లకు అమ్ముడుపోగా థియేట్రికల్ హక్కులు 314 కోట్లకు సేల్ అయ్యినట్లు తెలుస్తుంది. దీంతో 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 564 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు