Marriage Age: వివాహం వయస్సు బిల్లుపై చర్చించటానికి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మహిళల సంఖ్య పెంచండి

వివాహం వయస్సు బిల్లుపై చర్చించటానికి ప్యానెల్లో మహిళలసంఖ్య పెంచండి అంటూ మహిళ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు.

ShivSena MP urges more inclusive house panel for women’s marriage age bill : అమ్మాయిల కనీస వివాహ వయసు పెంచాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయా తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న కనీస వివాహం 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన తెచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో వివాహ వయస్సు పెంచాలనే నిర్ణయం కాదు..ఈ బిల్లును పరిశీలించటానికి..చర్చించటానికి ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో మహిళలకు చోటు కల్పించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ ప్రియాంక రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి సోమవారం (జనవరి 3,2022) లేఖ రాశారు.

Read more : Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

పార్లమెంట్ స్థాయీ సంఘంలోని 31 సభ్యుల్లో కేవలం ఒకే ఒక్క మహిళ ఉండటం సరికాదని..ప్యానెల్ లో మహిళల సంఖ్య పెంచాలని ఆమె లేఖలో కోరారు. మహిళలకు సంబంధించిన కీలకమైన బిల్లును పరిశీలిస్తున్న కమిటీలో మహిళలు ఉండాలని..కానీ ప్యానెల్ లో మహిళల ప్రాతినిత్యం లేకపోవటం అత్యంత బాధాకరమని అన్నారామె.

మరోవైపు ఈ స్థాయీ సంఘంలో ఉన్న ఏకైక మహిళా సభ్యురాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్‌ కూడా ఈ అంశంపై గళమెత్తారు. ఆమె పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌ సహస్రబుద్ధెకు లేఖ రాశారు. అందులో కమిటీ ముందు పార్లమెంట్‌లోని మహిళా సభ్యులందరికీ తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యసభలో 29, లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలు ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

Read more : 21 years Marriage Age Act : పెళ్లికి 21 ఏళ్ల నిబంధన..కొత్త చట్టం వస్తే బాలికల భద్రత,రక్షణ సమస్యే : ముస్లిం పెద్దలు

కాగా..బీజేపీ సీనియర్ నాయకుడు వినయ్ సహస్రబుద్ధే నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల జాబితా ప్రకారం..31 మంది సభ్యులలో సుస్మితా దేవ్ మాత్రమే ఏకైక మహిళ. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాత్రమే కాకుండా ఈ అంశంపై టిఎంసి ఎంపి సుస్మితా దేవ్ కూడా పార్లమెంటరీ ప్యానెల్‌లో మరింతమంది మహిళా ఎంపిలను చేర్చాలని కోరుతూ విద్య, మహిళలు, పిల్లలు, యువత మరియు క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మరియు బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ సహస్రబుద్ధేకు లేఖ రాశారు.

Read more : Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయిస్తారా?..
వీరితో పాటు డీఎంకే నాయకురాలు, లోక్‌సభ ఎంపీ కనిమొళి కూడా స్థాయీ సంఘం కూర్పుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘పార్లమెంట్‌లో 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు. కమిటీలో మాత్రం 30 మంది పురుషులుంటే.. ఒకే ఒక్క మహిళ ఉన్నారనీ..స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయిస్తారా? ఇదేం పద్ధతి? అంటూ ప్రశ్నించారు. మహిళలకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకునే ప్యానెటల్ లో కూడా మహిళలు లేకపోవటం శోచనీయమని అన్నారు. మహిళలను మూగ ప్రేక్షకులను చేస్తున్నారు’’ అని కనిమొళి ట్వీట్‌ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు