Shree Rapaka : బిగ్‌బాస్‌ నుంచి ఆర్జీవీ భామ అవుట్..

ఈ సారి 24 గంటలంటూ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రెండు వారాలని పూర్తి చేసుకుంది. మొదటి వారం నుండే ఈ షో రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి గతంలో...........

BiggBoss Non Stop :  ఈ సారి 24 గంటలంటూ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రెండు వారాలని పూర్తి చేసుకుంది. మొదటి వారం నుండే ఈ షో రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి గతంలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ షోలో ఉన్నారు. మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. దీంతో ఈ సారి గేమ్ వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టు సాగుతుంది.

రెండో వారంలో సరయు,అఖిల్‌,హమీదా, అనిల్‌, మిత్రా శర్మ, అరియానా, శివ, నటరాజ్‌ మాస్టర్‌, అషూ రెడ్డి, శ్రీరాపాక, మహేశ్‌ విట్టా.. మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ సారి హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో ఈ ఎలిమినేషన్ సాగింది. రెండో వారంలో బిగ్‌బాస్‌ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యారు.

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటున్న శ్రీ రాపాకని తన నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్ ని చేశాడు ఆర్జీవీ. ఇందులో చాలా బోల్డ్ గా నటించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపొయింది స్వీటీ అలియాస్ శ్రీరాపాక. ఆర్జీవీ పుణ్యమా అంటూ తర్వాత యాక్టర్ గా కూడా బిజీ అయింది ఈ బోల్డ్ బ్యూటీ. ఈ సారి బిగ్‌బాస్‌‌ ఆఫర్ రావడంతో శ్రీ రాపాక కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆర్జీవీ కూడా శ్రీరాపాక కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆర్జీవీ సపోర్ట్ తో శ్రీ రాపాకకి మరింత ప్లస్ అవుతుందని అనుకున్నారు.

Kamal Haasan : లోకనాయకుడు వచ్చేస్తున్నాడు.. ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

కానీ వరుసగా రెండు వారాలు నామినేషన్ లోకి వచ్చిన శ్రీ రాపాక రెండో వారం ఎలిమినేట్ అయింది. శ్రీ రాపాక ఎలిమినేట్ అవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక హౌస్ లో ఉన్న బోల్డ్ బ్యూటీలలో ఒకరు తగ్గారు. మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో కొంచెం కలర్ తగ్గింది. మరి ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు