Softball Player Fakes Injury : అదో గ్రౌండ్..అక్కడ సాప్ట్ బాల్ టోర్నీ జరుగుతోంది. అవతలి నుంచి బాల్ వేయబోయింది. ఒక్కసారి అందరికీ షాక్. షాట్ కొట్టబోయిన మహిళ కుప్పకూలిపోయింది. ఏమైందో ఏమో అని అనుకున్నారు. వెంటనే డాక్టర్ రప్పించాలని సైగలు చేస్తున్నారు. మ్యాచ్ చూస్తూ..కూర్చొన్న మరో మహిళ గ్రౌండ్ లోకి వచ్చింది. ఏమైందో అని అడుగుతోంది. అంతే..అప్పటి వరకు గాయాలయినట్లు నటించిన..ఆమె ఉంగరం తీసి ప్రపోజల్ చేయడంతో..అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. చివరకు ఒకే అనడంతో..ఇద్దరు హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
Read More : CM KCR Tour : తమిళనాడుకు సీఎం కేసీఆర్
సారా రియో, జసింత కమాండేలు ప్రొఫెషనల్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణిలు. వీరిద్దరూ గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఓ లీగ్ గేమ్ ఆడుతున్నారు. మ్యాచ్ మధ్యలో గాయపడినట్లు సారా నటించింది. స్టాండ్స్ లో ఉన్న జసింత మైదానంలోకి పరుగెత్తి వచ్చింది. అప్పటి వరకు పడిపోయినట్లు నటించిన సారా…జసింత రావడంతోనే..మోకాళ్లపై నిల్చొని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఊహించిన పరిణామంతో మైదానంలో ఉన్న వారు, జసింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అనంతరం తేరుకున్న జసింత..ముసి ముసినవ్వులు నవ్వుతూ…ప్రేయసి సారాను హత్తుకోవడంతో అందరూ చప్పట్లు కొట్టడం వీడియోలో కనిపించింది.
Wait for it… pic.twitter.com/gZ3tTxnJ9w
— Rex Chapman?? (@RexChapman) December 10, 2021