South Heroines: టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్లై అంటున్నారు సౌత్ టాప్ హీరోయిన్స్. ఇలా ఉంటేనే, అలా సినిమా చేస్తామని తెగేసి చెప్పేస్తున్నారు. ఏమన్నా అంటే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని వాళ్లు చేయాలనుకున్నది చేసి చూపిస్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, మా టాలెంట్ గుర్తించి.. దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఇవ్వండి అంటోన్న ఆ హీరోయిన్స్ ఎవరు..?
Love Story : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..
నాకూ ఓ కోరిక ఉందంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాను చేసే సినిమాల్లో మేల్ లీడ్‌తో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కేలా చూసుకుంటోంది. హీరోకి ఎంత ఇంపార్టెంట్స్ ఇస్తారో.. తను చేస్తోన్న రోల్‌కి అంతే.. వీలైతే ఇంకా ఎక్కువగానే తనను ఎక్స్ప్లోర్ చేయాలనే డిమాండ్ రష్మికది. తెలుగులో సెట్స్‌పై ఉన్న‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు బాలీవుడ్ మూవీస్ ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ సినిమాల్లో ఈ కన్నడ కస్తూరివి ఫెంటాస్టిక్ రోల్స్ అనే టాక్ నడుస్తోంది. ఇలా క్యారెక్టర్ నచ్చే రీసెంట్గా హను రాఘవపూడి, దుల్కర్ సల్మాన్ కాంబో ‘లెఫ్ట్‌నెంట్ రామ్’ మూవీలో స్పెషల్ రోల్ యాక్సెప్ట్ చేసినట్టు రష్మికపై న్యూస్ ట్రెండ్ అవుతోంది.
రోల్ లెంత్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా లేకపోవచ్చు.. స్టార్ హీరో సినిమా అయితే చాలంటోంది పూజా హెగ్డే. కేవలం పెద్ద హీరోలతో మాత్రమే ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తోంది. ఇప్పుడలాగే సౌత్ టు నార్త్ ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, విజయ్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్స్ సరసన నటిస్తోంది. అయితే లక్కీగా పూజా కొన్ని మంచి క్యారెక్టర్స్ కొట్టేస్తుంది. రిలీజ్‌కి రెడీ అవుతోన్న ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘సర్కస్’ సినిమాలతో పాటు రీసెంట్గా త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమాలో పూజానే ఫిక్సయింది. అంతేకాదు పవర్ స్టార్ – హరీశ్ శంకర్ కాంబో ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రాజెక్ట్‌తో పాటు అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ లోనూ అవకాశం ఈ సుందరినే వరించిందనే టాక్ నడుస్తోంది.
R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..
కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు, తమిళ్ పరిశ్రమను ఏలుతోన్న సమంత.. ఇప్పుడు ఇంకా కొత్తగా ఆలోచిస్తోంది. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు బోల్డ్ క్యారెక్టర్స్‌కి సైతం ఎస్ చెప్పేస్తోంది. సినిమాలు మాత్రమే కాదు టీవీ షోస్, వెబ్ సిరీస్.. కంటెంట్ ఉంటే చాలు తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు రెడీఅంటోంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ రాజీ రోల్ తర్వాత బాలీవుడ్లో సత్తా చాటేందుకు ట్రై చేస్తోంది సామ్. త్వరలోనే మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో పాటు ఓ బాలీవుడ్ సినిమాను సామ్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇటు ‘శాకుంతలం’ వంటి గుణ శేఖర్ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేసిన సామ్.. త్వరలోనే శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మరో సూపర్ రోల్‌తో రాబోతున్నట్టు చెప్తున్నారు.
Samantha : గ్యాంగ్‌తో చిల్ అయిన సమంత..
పూజా, రష్మిక, సమంత.. వీళ్లు కేవలం సౌత్ మాత్రమే కాదు.. నార్త్‌లోనూ గట్టిగానే జెండా పాతేందుకు ట్రై చేస్తున్నారు. ఈ హీరోయిన్స్‌తో పాటే రేస్‌లో ఉన్నారు కొంతమంది నేచురల్ బ్యూటీస్. కానీ మా రూటే సపరేటు అనేస్తున్నారు. బాలీవుడ్‌పై ఇప్పట్లో ఫోకస్ చేసేది లేదు కానీ తెలుగు, తమిళ్లో కటౌట్ చూసుకొని డిమాండ్ చేస్తున్నారు.
Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..
నేచురర్ బ్యూటీ ప్లస్ న్యాచురల్ యాక్టింగ్‌తో ఇండస్ట్రీ ఫేవరెట్‌గా మారుతోంది సాయి పల్లవి. తనకు నచ్చిన సినిమాలే చేస్తుంది కానీ హై రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా కమర్షియల్ క్యారెక్టర్స్‌కి నో చెప్పేస్తోంది. పెద్ద పెద్ద హీరోలే ఇప్పుడు సాయి పల్లవి జపం చేస్తున్నారు. ఒక్కసారైనా ఆమెతో నటించాలి, స్టెప్పులేయాలనే కలలు కంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. సెన్సిబుల్ స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకొని తన క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చూసుకుంటోంది.
కథలో క్యారెక్టర్ నచ్చాలి.. తను చెప్పినట్లు ఆ రోల్‌ను ఇంప్రువైజ్ చేయాలి.. ఇలా అయితేనే సాయి పల్లవి సైన్ చేస్తుంది. చిన్న రోల్స్ చేయడం ఇష్టం లేక చిరు, పవన్ ప్రాజెక్టులనే వదిలేసుకుంది. ‘లవ్ స్టోరీ’ తో మరోసారి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె.. త్వరలోనే ‘విరాటపర్వం’ తో పాటు తమిళ్, మలయాళ సినిమాలతో రాబోతుంది. ఇక రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు తాను చేయబోయే ఓ వెబ్ సిరీస్ డిటేల్స్ కూడా రివీల్ చేయబోతుంది.
కీర్తి సురేష్.. కేవలం హీరోయిన్ రోల్స్ అని మడికట్టుకు కూర్చోలేదు ఈ హీరోయిన్. పెద్ద స్టార్స్ పక్కన స్ట్రాంగ్ రోల్ ఆఫర్ వస్తే వెంటనే ఓకే చెప్పేస్తోంది. సీనియర్ స్టార్ హీరోలకు చెల్లెలిగా కనిపించేందుకు సై అంటోంది. రజనీ కాంత్ ‘అన్నాత్తే’ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీలోనూ హీరోలకు సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తోంది కీర్తి సురేష్. అటు తమిళ్లో కూడా డైరెక్టర్ సెల్వ రాఘవన్ చెల్లెలిగా ‘సాని కాయిదం’ మూవీలో నటిస్తోంది. సేమ్ టైమ్ ‘సర్కారు వారి పాట’ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన సైన్ చేస్తోంది. త్వరలోనే కీర్తి సురేష్ మరికొన్ని సినిమాల విశేషాలను రివీల్ చేయబోతుంది.