Health Secretary Srinivasarao : ఫిబ్రవరిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది – శ్రీనివాసరావు

రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కేసుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

Health Secretary Srinivasarao : : రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కేసుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో శ్రీనివాసరావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు . ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో బాధితులు ఆస్పత్రుల్లో చేరడం తక్కువగా ఉందని తెలిపారు.

చదవండి : Omicron: ‘కేసులు పెరుగుతున్నాయ్.. హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు లేవు’

ఒమిక్రాన్ వలన ఒక్క మరణం కూడా సంభవించలేదని వివరించారు. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, కొందరిలో ఇటువంటివేమీ లేవని తెలిపారు. ఈ వేరియంట్‌తో పెద్దగా సమస్య లేకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు.నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత నాలుగైదు రోజులుగా ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. గుంపులుగా ఉండటం లేదని, మాస్కులు ధరిస్తున్నారని తెలిపారు. ఇక తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

చదవండి : Omicron Variant: జైపూర్‌లో పెళ్లికి హాజరైన 9మంది ఒమిక్రాన్ పేషెంట్లు

కరోనా మూడో వేవ్‌ వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలో 41 దేశాల్లో 700లకు పైచిలుకు ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు తెలిపారు శ్రీనివాసరావు, ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి 900 మందికిపైగా రాష్ట్రానికి చేరుకోగా.. అందులో 13 మందికి కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపామన్నారు. ఇక ఇదే సమయంలో లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావు. కరోనా వ్యాప్తిని అరికట్టడడానికి లాక్‌డౌన్లు పెట్టడం పరిష్కారం కాదని శ్రీనివాసరావు అన్నారు.

చదవండి : Omicron Cases In UK : బ్రిటన్ లో 246 ఒమిక్రాన్ కేసులు..ఒక్కరోజులోనే 50శాతానికి పైగా

భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్లు ఉండవని పేర్కొన్నారు. టెస్టుల సంఖ్య పెంచడం వైరస్ వ్యాప్తిని గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు, భౌతికదూరం ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

ట్రెండింగ్ వార్తలు