స్కూళ్లకు దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

2025 జనవరి 10వ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి.

School Academic Calendar 2024 25 : తెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ కానున్నాయి? ఈసారి పని దినాలు ఎన్ని? సెలవులు ఎన్ని? దసరా, సంక్రాంతి హాలిడేస్ ఎప్పుడు? ఎన్ని రోజులు ఇచ్చారు? వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఉంటాయి? పాఠశాలల టైమింగ్స్ ఏంటి? దీనికి సంబంధించి క్యాలెండర్ వచ్చేసింది.

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతులకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. 2025 ఏప్రిల్ 24 స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పని దినాలు మొత్తం 229 రోజులు. 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు (49 రోజులు) వేసవి సెలవులు ఉంటాయి.

2025 జనవరి 10వ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. 2025 ఫిబ్రవరి 28 వరకు ఒకటో తరగతి నుంచి 9 వ తరగతి సిలబస్ పూర్తి కావాలి. 2024 జూన్ 1 నుంచి జూన్ 11 వరకు బడి బాట కార్యక్రమం ఉంటుంది.

* అక్టోబర్ 2 నుంచి 14 వరకు (13 రోజులు) స్కూళ్లకు దసరా సెలవులు.
* డిసెంబర్ 23 నుంచి 27 వరకు (5 రోజులు) క్రిస్మస్ సెలవులు (మిషనరీ స్కూళ్లకి).
* 2025 జనవరి 13 నుంచి 17 వరకు (5 రోజులు) సంక్రాంతి సెలవులు.
* ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉన్నత పాఠశాలల్లో క్లాసులు నిర్వహిస్తారు.
* జూన్ 1 నుండి 11 వరకు బడి బాట.
* 2025 ఫిబ్రవరిలోపు టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణ.
* 2025 మార్చిలో టెన్త్ ఫైనల్ పరీక్షలు.

Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..

 

ట్రెండింగ్ వార్తలు