బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని, బీఆర్ఎస్ అధికారిక కెనరా బ్యాంక్ ఖాతా నుంచి ..

Raghunandan Rao : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఆ లేఖలో రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

Also Read : Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య బాబు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని, బీఆర్ఎస్ అధికారిక కెనరా బ్యాంక్ ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు నగదు బదిలీ చేసిందని రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కీలక సూచనలు చేసిన ఈసీ.. అవేమిటంటే?

ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలు ఓట్లు కొనుగోలుకు వాడుతారని, వెంటనే అకౌంట్ లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణజరపాలని రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రాసిన లేఖలో కోరారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా ఆయన తన లేఖలో జత చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు