MET Gala 2021 : మెట్ గాలాలో త‌ళుక్కుమ‌న్న సుధారెడ్డి..ఈమె ధరించిన గౌన్ వెరీ స్పెషల్

అమెరికాలో జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ఈ ఏడాది ఒకే ఒక్క భారతీయ మహిళ తళుక్కుమన్నారు. హైదరాబాద్ కు చెందిన సుధా రెడ్డి మెట్ గాలా వేడుకలో మెరిసిపోయారు.

MET Gala 2021 Only Indian Sudhareddy: మెట్ గాలా. మెట్ గాలాను ‘మెట్ బాల్’ అని కూడా పిలుస్తుంటారు. కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ అని కూడా అంటారు. గ్లామరస్ గా సాగే ఈ గాలాను ఏదో అవార్డుల కోసమో లేదంటే వినోదం కోసమో నిర్వహించరు. వాస్తవానికి ఇదో ఫండ్ రైజింగ్ (నిధుల సేకరణ) ఈవెంట్. సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్ ‘మెట్ గాలా’‌. అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో 2021కు గాను జరిగిన ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో ఓ భారతీయ మహిళ తళుక్కుమని మెరిసింది. ఆమే సుధారెడ్డి. ఎవరీ సుధారెడ్డి? అంటే సుధారెడ్డి మన హైదరాబాద్ మహిళే కావటం విశేషం.ప్రతీ సంవత్సరం మే నెలలో ఈ ఈవెంట్ జరుగుతుంది. కానీ కరోనా వల్ల అన్ని కార్యక్రమాలువలెనె ఇది కూడా వాయిదా పడి సెప్టెంబర్ లో జరిగింది.

Read more : MET Gala 2021: జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ 40కిలోల డ్రెస్ కోసం 100 మంది 6,650 గంటలు పనిచేశారట!

సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్‌ ‘మెట్ గాలా’ రెడ్ కార్పెట్‌పై ప్ర‌పంచం న‌లుమూలల నుంచీ సెల‌బ్రిటీలు హొయ‌లు పోతూ ఫొటోల‌కు ఫోజులిస్తారు. వారి అందాలను..సొగసుల్ని కెమెరాల్లో బంధిస్తారు ఫోటో గ్రాఫర్లు. అలాంటి ఈవెంట్‌లో ఈసారి ఇండియా నుంచి ఒకే ఒక్క వ్య‌క్తి పాల్గొన్నారు. ఆమె సుధా రెడ్డి. సుధారెడ్డి సెల‌బ్రిటీకాదు. సినిమా స్టార్ అంతకంటే కాదు.

Read more : మేనకోడలితో మేకప్.. క్యూట్ కిరీటంతో మెరిసిన ప్రియాంకచోప్రా

ఈమె మ‌న హైద‌రాబాదీ మహిళే. న‌గ‌రానికి చెందిన బ‌డా వ్యాపార‌వేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ కూడా.ఈక్రమంలో సుధారెడ్డి ఫస్ట్ టైమ్ ‘మెట్ గాలా రెడ్ కార్పెట్‌’పై త‌ళుక్కుమ‌ని మెరిశారు. డిజైన‌ర్ జోడీ ఫాల్గుని, షేన్ పీకాక్ రూపొందించిన గౌన్‌లో సుధారెడ్డి చూపరుల్ని ఆకట్టుకున్నారు. ఆర్ట్‌, ఫ్యాష‌న్ అంటే చాలా ఇష్టపడే సుధారెడ్డి ఇలా ఫస్ట్ టైమ్ ఓ అంత‌ర్జాతీయ వేదిక‌పై క‌నిపించ‌డం విశేషం.

గతంలో జరిగిన ఈ మెట్ గాలా ఈవెంట్ లో భారత్ నుంచి బాలివుడ్ ప్రముఖ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా ప‌దుకొనె పాల్గొన్నారు. అలాగే ఇషా అంబానీ కూడా ఈ మెట్ గాలాలో సంద‌డి చేశారు. కానీ సినిమాల‌కు ఏమాత్రం సంబంధం లేని సుధారెడ్డి మెట్ గాలా రెడ్‌కార్పెట్‌పై క‌నువిందు చేయటం విశేషమే మరి.

స్పెషల్ గా సుధారెడ్డి గౌన్‌..
ఈ ఈవెంట్ లో సుధారెడ్డి వేసుకున్న గౌన్ వెరీ స్పెష‌ల్ అనే చెప్పాలి‌. ఈ గౌనును ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పీకాక్ డిజైన్ చేసి తయారు చేయటానికి 250 గంట‌ల స‌మ‌యం ప‌ట్టిందట. ప్రముఖ డిజైన‌ర్ ఫ‌రా ఖాన్ చేసిన డ్రీమీ డెకాడెన్స్ జువెల‌రీని సుధారెడ్డి ధ‌రించి మెరిసిపోయారు మెట్ గాలా రెడ్ కార్పెట్ పై.

ట్రెండింగ్ వార్తలు