Cm Revanth Reddy : ఏపీలో షర్మిల గెలుస్తుంది..! ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైనా సరే- ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ మాటను ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ కు తప్పకుండా స్థానం ఉంటుంది..

Cm Revanth Reddy On Ys Sharmila (Photo Credit : Facebook)

Cm Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కడప లోక్ సభ స్థానంలో వైఎస్ షర్మిల గెలుస్తుందని ఆయన చెప్పారు. అంతేకాదు.. ఏపీలో ఎవరు సీఎం అయినా సరే.. మంచి సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇక ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయన్న రేవంత్.. ఇక తన ఫోకస్ అంతా పాలనపైనే అని తేల్చి చెప్పారు.

”రాష్ట్రమే నా ప్రపంచం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే నా లక్ష్యం. మాది.. పాజిటివ్ దృక్పథం మాత్రమే. ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. పంద్రాగస్ట్ ఎక్కడ నిర్వహించాలన్నది కేబినెట్ నిర్ణయిస్తుంది. విద్యా సిలబస్ పై కమిషన్ వేస్తాం. విద్య, వ్యవసాయ కమిషన్లు వేస్తాం. రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తాం. బీఆర్ఎస్ కు డిపాజిట్లు పోతాయని చెప్పా. ఇదే నిజం కాబోతోంది. ఐదేళ్లలో చేసేది 100 రోజుల్లో చేయగలమా..? ప్రయార్టీ దృష్టిలో అంశాలను తీసుకుంటున్నాం. 100 రోజుల్లో కేసీఆర్ చేసిన 30వేల కోట్ల అప్పు తీర్చాను” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”కేసీఆర్ కు పిచ్చి పట్టింది. నిధులు మింగడానికే.. తాగునీటి కోసం జలాశయాలు అంటున్నారు. గోదావరి జలాలు.. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు రెగ్యులర్ గా వచ్చేలా చేస్తాం. ఫార్మా విలేజ్ లతో పొల్యూషన్ కంట్రోల్ చేయడం సులభం. ఫార్మా సిటీలను విస్తరణ చేస్తాం. ఒకే దగ్గర అన్ని ఫార్మా కంపెనీలు ఉంటే సిటీ విడిచి పెట్టి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని కొన్ని ఉంటే వాటిని మెయింటెన్ చేయవచ్చు. కుప్ప లాగా ఉంటే రూల్స్ పాటించరు.

మెట్రోను ఎల్ అండ్ టీ అమ్ముకుంటే.. అమ్ముకోని మేము చేసేది ఏముంటుంది? వాళ్ల ఆస్తి వాళ్లు అమ్ముకుంటే చేసేదేముంటుంది? సిటీకి దూరంగా డీ సెంట్రలైజేషన్ తో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.. టాటాతో స్కిల్ శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను బలోపేతం చేస్తాం.

జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో చర్చిస్తాం. మండలాలు, రెవెన్యూ డివిజన్లను రేషనలైజ్ చేస్తే.. సమస్యలు పరిష్కారం అవుతాయి. కేసీఆర్ మాటను ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగిన రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్ లో చర్చించి.. చర్యలు తీసుకుంటాం. మహబూబ్ నగర్ లో 50వేల మెజారిటీ తగ్గకుండా గెలుస్తాం. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ కు తప్పకుండా స్థానం ఉంటుంది” అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Also Read : రేవంత్ రెడ్డికి ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు