Ownership in Okra : బెండలో మేలైన ఎరువుల యాజమాన్యం

జులై 15 వరకు బెండను విత్తుకోచ్చు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలుప్రాంతాల్లో బెండ విత్తనాలను విత్తారు. అయితే సాగు పద్దతుల్లో ఎన్ని మొళకువలు పాటించనప్పటికి ఈ పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి..తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

Ownership in Okra

Ownership in Okra : ప్రసుత్తం కాలంలో కూరగాయల సాగు రైతుల పాలిట వరంగా మారింది. ముఖ్యంగా వానాకాలంలో సాగయ్యే కూరగాయల పంటల్లో బెండసాగు.. రైతులకు లాభాలను అందించడంలో ముందుంటోంది. బెండకు మార్కెట్‌లో స్థిరమైన ధరలు ఉండటంతో చాలామంది రైతులు బెండుసాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే బెండలో అధిక దిగుబడులు సాధించాలంటే సమయానుకూలంగా ఎరువుల యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని  తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, శ్రవంతి.

READ ALSO : Lady Fingers Cultivation : బెండసాగుతో.. రైతులకు లాభాలు అధికం

బెండ ఏడాది పొడ‌వునా సాగ‌య్యే పంట‌. 4 నెల‌లు కాల‌ప‌రిమితి కలిగిన ఈ పంట‌లో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక, రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు..మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. బెండసాగుకు వానాకాలం అనుకూలంగా ఉంటుంది.

READ ALSO : Kharif Paddy : ఖరీఫ్ వరినారుమడులను పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం చేపట్టాల్సిన మెళకువలు

జులై 15 వరకు బెండను విత్తుకోచ్చు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలుప్రాంతాల్లో బెండ విత్తనాలను విత్తారు. అయితే సాగు పద్దతుల్లో ఎన్ని మొళకువలు పాటించనప్పటికి ఈ పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి..తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మరోవైపు కలుపు సమస్య అధికంగా ఉండటంతో..పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక దిగుబడులు సాధించాలంటే తొలకరి బెండసాగులో ఎరువుల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, శ్రవంతి.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

బెండలో చీడపీడల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. రైతులు సరైన సమయంలో వాటిని గుర్తించి.. సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకు 20 రూపాయల వరకు పలుకుతుంది. మార్కెట్ కు అనుగుణంగా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకొని, శాస్త్ర‌వేత్త‌ల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తే బెండ సాగులో..అధిక దిగుబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు.

ట్రెండింగ్ వార్తలు