Supreme Court: పెద్ద నోట్లరద్దుపై 50కి పైగా పిటిషన్లు.. జనవరి 2న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఆరేళ్ల తర్వాత డిసెంబర్ 7న అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌లో ఉంచింది. తీర్పును రిజర్వ్ చేస్తూ, 2016 నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలు, రికార్డులను సమర్పించాలని కేంద్రంతో పాటు ఆర్‌బిఐని ధర్మాసనం కోరింది. అన్ని రికార్డులను సీల్డ్ కవర్‌లో దాఖలు చేస్తామని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

Supreme Court: 2016లో నరేంద్రమోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ 50కి పైగా దాఖలైన పిటిషన్లపై కొంత కాలంగా విచారణ చేస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ విషయమై జనవరి 2న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించనుంది. ఆ మర్నాటే జస్టిస్ నజీర్ పదవీ విరమణ చేయనున్నారు.

Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఆరేళ్ల తర్వాత డిసెంబర్ 7న అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌లో ఉంచింది. తీర్పును రిజర్వ్ చేస్తూ, 2016 నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలు, రికార్డులను సమర్పించాలని కేంద్రంతో పాటు ఆర్‌బిఐని ధర్మాసనం కోరింది. అన్ని రికార్డులను సీల్డ్ కవర్‌లో దాఖలు చేస్తామని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

India-China Clash: లధాఖ్ నుంచి అరుణాచల్ వరకు.. చైనాతో సరిహద్దును గరుడ దళంతో కట్టుదిట్టం చేసిన భారత్

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది, మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం వాదనలు వినిపిస్తూ.. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా తప్పుదోవ పట్టిందని, ఇది చాలా లోపభూయిష్టమైందని అన్నారు. ఇది అత్యంత దారుణమైన నిర్ణయమని, ఈ ప్రక్రియ ఈ దేశ చట్ట పాలనను అపహాస్యం చేసిందని అన్నారు. నోట్ల రద్దు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఏదైనా అధికారం సెంట్రల్ బోర్డు సిఫారసుపై మాత్రమే ఉందని ఆయన అన్నారు, అయితే ప్రస్తుత కేసులో ఈ విధానానికి విరుద్ధంగా ఉందని చిదంబరం వాదించారు.

Maharashtra: గాంధీతో మోదీకి పోలికేంటి? అమృత ఫడ్నవీస్ ‘ఇద్దరు జాతి పితలు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్

ఇక ప్రభుత్వం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపిస్తూ నోట్ల రద్దు విధానాన్ని సమర్థించారు. ఆర్థిక వ్యవస్థలో ఒక వైపు పెద్ద ప్రయోజనాలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు సాటిలేనివని అన్నారు. నోట్ల రద్దు తన నిర్దేశిత లక్ష్యంలో విఫలమైందని, అదే సమయంలో అనవసరమైన కష్టాలను తెచ్చిపెట్టిందన్న వాదన అపోహ అని ఏజీ అన్నారు. “ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోణం నుంచి చూస్తే, పెద్ద నోట్ల రద్దు విఫలమైందని చెప్పలేము” అని ఏజీ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు