IND VS WI 2nd T20 : సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. రోహిత్‌, కోహ్లి త‌రువాత స్కైకి అద్భుత అవ‌కాశం..!

గ‌యానా వేదిక‌గా వెస్టిండీస్ జ‌ట్టుతో టీమ్ఇండియా రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ద‌మైంది. తొలి టీ20 మ్యాచ్‌లో ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో విఫ‌ల‌మైన భార‌త జ‌ట్టు నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది.

Suryakumar Yadav

IND VS WI 2nd T20-Suryakumar Yadav : గ‌యానా వేదిక‌గా వెస్టిండీస్ జ‌ట్టుతో టీమ్ఇండియా రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ద‌మైంది. తొలి టీ20 మ్యాచ్‌లో ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో విఫ‌ల‌మైన భార‌త జ‌ట్టు నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. దీంతో 5 టీ20 మ్యాచుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుక‌బ‌డి ఉంది. ఈ నేప‌థ్యంలో నేడు జ‌రగ‌నున్న రెండో టీ20 మ్యాచులో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది. మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న వెస్టిండీస్ అదే ఊపులో రెండో మ్యాచులోనూ గెలుపొంది త‌మ ఆధిక్యాన్ని మ‌రింత‌గా పెంచుకోవాల‌ని భావిస్తోంది.

సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రో 3 సిక్సులు బాదితే..

ప్ర‌స్తుతం సూర్య‌కుమార్ యాద‌వ్‌(Suryakumar Yadav)ను ఓ రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20 మ్యాచులో సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌నుక మూడు సిక్స‌ర్లు బాదితే టీ20ల్లో 100 సిక్స‌ర్లు బాదిన మూడో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ (Rohit Sharma) 182 సిక్స‌ర్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా ఆ త‌రువాత విరాట్ కోహ్లి (Virat Kohli) 117 సిక్స్‌ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు 49 అంత‌ర్జాతీయ టీ20 మ్యాచుల్లో 97 సిక్స‌ర్లు కొట్టి ప్ర‌స్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో 99 సిక్స‌ర్ల‌తో కేఎల్ రాహుల్ ఉన్నాడు.

BCCI: బీసీసీఐకి భారీ ఆదాయం.. వచ్చే ఐదేళ్లలో రూ.8,200 కోట్లు వచ్చే అవకాశం? ఎలా అంటే..

ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే.. అంత‌ర్జాతీయ టీ20ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది బ్యాట‌ర్లు మాత్ర‌మే 100 సిక్స‌ర్లు బాదారు. ఈ జాబితాలోనూ రోహిత్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ త‌రువాత మార్టిన్‌ గప్తిల్‌ (173), ఆరోన్‌ ఫించ్‌ (125), క్రిస్‌ గేల్‌ (124), పాల్‌ స్టిర్లింగ్‌ (123), ఇయాన్‌ మోర్గాన్‌ (120), విరాట్ కోహ్లి(117), జోస్‌ బట్లర్‌ (113), ఎవిన్‌ లూయిస్‌ (111), కొలిన్‌ మున్రో (107), మ్యాక్స్‌వెల్‌ (106), డేవిడ్‌ మిల్లర్‌ (106), డేవిడ్‌ వార్నర్‌ (105) ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. సూర్య ఇప్ప‌టి వ‌ర‌కు 47 టీ20 మ్యాచుల్లో 45.8 స‌గ‌టున 1,696 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 13 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. సూర్య ఇప్ప‌టి వ‌ర‌కు 97 సిక్సర్లు, 152 ఫోర్లు బాదాడు.

Prithvi Shaw : ద‌రిద్రం నీ వెంటే ఉందా భ‌య్యా..! విచిత్ర రీతిలో పృథ్వీ షా ఔట్‌.. వీడియో

ట్రెండింగ్ వార్తలు