Prithvi Shaw : ద‌రిద్రం నీ వెంటే ఉందా భ‌య్యా..! విచిత్ర రీతిలో పృథ్వీ షా ఔట్‌.. వీడియో

భార‌త యువ ఆట‌గాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు నిల‌క‌డ‌లేక‌పోవ‌డంతో జాతీయ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్2023 సీజ‌న్‌లో స‌త్తా చాటి తిరిగి జ‌ట్టులో చోటు సంపాదించుకుంటాడు అనుకుంటే ఘోరంగా విఫ‌లం అయ్యాడు.

Prithvi Shaw Hit Wicket

Prithvi Shaw Hit Wicket : భార‌త యువ ఆట‌గాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు నిల‌క‌డ‌లేక‌పోవ‌డంతో జాతీయ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్2023 సీజ‌న్‌లో స‌త్తా చాటి తిరిగి జ‌ట్టులో చోటు సంపాదించుకుంటాడు అనుకుంటే ఘోరంగా విఫ‌లం అయ్యాడు. పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న పూర్వ‌పు ఫామ్‌ను అందుకోవ‌డంతో పాటు టీమ్ఇండియాలో చోటు ద‌క్కించుకోవాల‌న్న క‌సితో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. నార్తాంప్ట‌న్‌షైర్ జ‌ట్టుతో జ‌త క‌ట్టాడు.

అయితే.. తొలి మ్యాచ్‌లోనే అత‌డు దురదృష్టకరంగా ఔట్ అయ్యాడు. రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్‌లో భాగంగా శుక్ర‌వారం గ్లౌసెస్టర్‌షైర్‌, నార్తాంప్ట‌న్‌షైర్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. నార్తాంప్టన్ షైర్ టీమ్ త‌రుపున అరంగేట్రం చేసిన పృథ్వీ షా 35 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. క్రీజులో సెట్ అయ్యాడు ఇక భారీ స్కోరు చేస్తాడు అని బావిస్తున్న క్ర‌మంలో విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు.

Rishabh Pant : శుభ‌వార్త‌.. 140కి.మీ వేగంతో వ‌స్తున్న బంతుల‌ను ఎదుర్కొంటున్న పంత్‌.. త్వ‌ర‌లోనే..

నార్తాంప్ట‌న్‌షైర్ ఇన్నింగ్స్ 16 ఓవ‌ర్‌ను గ్లౌసెస్టర్‌షైర్ బౌల‌ర్ వాన్ మికెర‌న్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని బౌన్స‌ర్‌గా సంధించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న షా పుల్ షాట్ ఆడ‌బోయాడు. అయితే.. బ్యాలెన్స్ కోల్పోయాడు. కింద‌ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలో అత‌డి కాలు వికెట్ల‌ను తాక‌డంతో బెయిల్స్ కింద‌ప‌డ్డాయి. దీంతో అత‌డు హిట్‌వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs WI : ఐసీసీ షాక్‌.. గెలిచిన వెస్టిండీస్‌కు 10, ఓడిన టీమిండియాకు 5 శాతం జ‌రిమానా.. ఎందుకో తెలుసా..?

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. దుర‌దృష్టం నీ వెన్నంటే ఉందిగా బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ 48.4 ఓవ‌ర్ల‌లో 278 ప‌రుగులు చేయ‌గా ల‌క్ష్య చేధ‌న‌లో నార్తాంప్ట‌న్‌షైర్ 48.1 ఓవ‌ర్ల‌లో 255 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

RCB : క‌ప్పులు గెలిపించే కోచ్ వ‌చ్చాడు.. ఆర్‌సీబీ రాత మారుస్తాడా..?

ట్రెండింగ్ వార్తలు