Tech Tips in Telugu : మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు!

Tech Tips in Telugu : డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Tech Tips in Telugu _ Multiple SIM Cards Linked To 1 Aadhaar Card_ Here's How To Check

Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో తెలుసా? ఎప్పుడైనా చెక్ చేశారా? సాధారణంగా ప్రతి ఆధార్ కార్డుదారుడికి వారి ఫోన్ నెంబర్‌కు ఏదో ఒకటి లింక్ అయి ఉంటుంది. డిజిటల్ లావాదేవీలకు ఆధార్ కేవైసీ లింక్ తప్పనిసరి. ఈ క్రమంలో సైబర్ నేరస్థులు ఆధార్ కార్డు విషయంలో అనేక మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా చాలామంది నిపుణులు సైబర్ మోసగాళ్ల చేతుల్లో మోసపోయిన పరిస్థితులు లేకపోలేదు.

కొత్త నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులు 658 సిమ్ కార్డులను ఒక ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు కనుగొన్నారు. దాంతో ఆయా సిమ్ కార్డులను వెంటనే రద్దు చేయాలని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారని ఔట్‌లెట్ తెలిపింది. ఓ వ్యక్తి పేరుతో సిమ్‌కార్డులు రిజిష్టర్‌ కాగా, మొబైల్‌ ఫోన్లు, కియోస్క్‌లు విక్రయించే దుకాణాలకు పంపిణీ చేసేవాడు.

Read Also : New Jio 5G Phones : అత్యంత సరసమైన ధరలో రెండు కొత్త జియో 5G ఫోన్లు.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఇదిగో ప్రూఫ్!

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. ఒక ఆధార్ నంబర్ ఇచ్చి మల్టీ సిమ్ నెట్‌వర్క్ కనెక్షన్లు తీసుకోవచ్చు. అయితే, ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిమ్ కార్డు కనెక్షన్ కోసం చాలామంది ఆధార్ కార్డు వివరాలను ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తెలియకుండానే ఆధార్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

Tech Tips in Telugu _ Multiple SIM Cards Linked To 1 Aadhaar Card

మీ ఆధార్ కార్డు విషయంలో కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ఇలా చెక్ చేసుకోవచ్చు. అందుకే, మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు వాడుతున్నారో DoT వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. tafcop.dgtelecom.gov.in (Sanchar Sathi)కి లాగిన్ చేయడం ద్వారా యూజర్ తన పేరుతో జారీ చేసిన SIM కార్డ్‌ల సంఖ్యను తెలుసుకోవడమే కాకుండా, పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్‌ను బ్లాక్ చేయవచ్చు.

మీ ఆధార్‌పై ఎన్ని SIM కార్డ్‌లు ఉన్నాయో చెక్ చేయండిలా :
Sanchar Sathi వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత వినియోగదారులు 2 లింక్‌ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ పోగొట్టుకున్న/దొంగిలించిన మొబైల్‌ని బ్లాక్ చేయండి. మీ మొబైల్ కనెక్షన్‌లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. రెండవ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుని 10-అంకెల మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, మొబైల్ నంబర్‌కు స్వీకరించే OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పేజీలో వినియోగదారు పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ల వివరాలు ఉంటాయి. వారి ఆధార్ కార్డులో ఏదైనా అన్‌నౌన్ నంబర్‌ ఉందని గుర్తిస్తే.. వెంటనే బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.

Read Also : Vivo X90 Pro Discount : వివో X90 ప్రోపై రూ. 10వేలు డిస్కౌంట్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ట్రెండింగ్ వార్తలు