Telangana: కీలక మలుపు తిరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. విచారణ సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం

ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితుల తరఫున బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Telangana: సంచలనం సృష్టించిన ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కీలక మలుపు తిరిగింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో నిందితుల తరఫున బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.

AP CM Jagan: బుధవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ

దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేసినట్లు, కేసు విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించినట్లు బీజేపీ తరఫు లాయర్, ఆ పార్టీ నేత రాంచందర్ రావు తెలిపారు. అక్టోబర్ 26న టీఆర్ఎస్ ఎమ్యెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే కారణంతో ఫామ్‌హౌజ్ నుంచి రామ చంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. మరుసటి రోజు వారిని అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే, కోర్టు నిందితులకు రిమాండ్ రిజెక్ట్ చేసింది. దీన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు.

Paragliding: ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్.. గుజరాత్‌లో దక్షిణ కొరియా వాసి మృతి, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు

ఏసీబీ నిర్ణయాన్ని రద్దు చేసిన హైకోర్టు, నిందితులకు రిమాండ్ విధించింది. అనంతరం దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నవంబర్ 4వరకు హైకోర్టు స్టే విధించింది. అయితే, నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. నవంబర్ 8న హైకోర్టు ఈ స్టే ఎత్తివేసింది. నవంబర్ 9న ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది. నిందితుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. కస్టడీలోకి తీసుకున్న నిందితులకు పోలీసులు ఎఫ్ఎస్ఎల్‌లో స్వర నమూనా పరీక్షలు నిర్వహించారు. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ, నవంబర్ 14న హైకోర్టులో నిందితుల తరఫున బీజేపీ మరో పిటిషన్ దాఖలు చేసింది.

Bharath ‘Pralay’ Ballistic Missiles : చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ .. వీటి రేంజ్ ఎంతంటే..

కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరింది. ఈ నెల 1న నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజాగా కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు