Minister Harish Rao : వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి : మంత్రి హరీష్ రావు

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బీ ఆర్ కే భవన్ లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై సమీక్షించారు.

Minister Harish Rao review on Omicron : రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బీ ఆర్ కే భవన్ లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను మంత్రికి వైద్య శాఖ అధికారులు వివరించారు. రిస్క్ దేశాల నుండి రాష్ట్రానికి 1805 మంది వచ్చారని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా రెండో డోసుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

Omicron In India : భారత్ లో 23కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ముంబైలో మరో ఇద్దరికి సోకిన వైరస్

రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపవద్దన్నారు. ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు