Piyush Goyal : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రులు భేటీ

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల సమావేశం ముగిసింది. ఖరీఫ్, రబీ సీటన్లు కలిపి 115 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని మంత్రులు కోరారు.

Telangana ministers meeting Piyush Goyal : కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల సమావేశం ముగిసింది. ఢిల్లీలో గంటకు పైగా సమావేశం సాగింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీటన్లు కలిపి 115 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని మంత్రులు కోరారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టత కోరారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం, రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్రమంత్రికి వివరించారు. మద్యాహ్నం 3 గంటల నుంచి మూడున్నర గంటలుగా కేంద్ర మంత్రి కోసం కృషి భవన్ లో మంత్రులు, ఎంపీలు ఎదురు చూశారు.

Guinness World Record : వృద్ధుడు గడ్డంతో 63 కేజీల మహిళను పైకెత్తాడు..

సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రులు సీఎం కేసీఆర్ కు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కేంద్ర అధికారులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు