Manasanamaha: ఆస్కార్‌కు నామినేటైన తొలి తెలుగు షార్ట్ ఫిల్మ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?

మేకింగ్ మీద వాళ్లకున్న ఇంట్రెస్ట్ కనిపించేలా ప్రాణం పెట్టి షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కింది మనసానమః షార్ట్ మూవీ.

Manasanamaha: ఒకవైపు మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని దున్నేసేందుకు దూసుకెళ్తుంటే.. చిన్న సినిమాలు కూడా తక్కువేం కాదని నిరూపిస్తున్నారు మేకర్స్. కరోనా తర్వాత ప్రజలలో ఇంటర్నెట్ వాడకం ఎంత పెరిగిందో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా అదే స్థాయిలో పెరిగింది. అయితే.. కొందరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏదో తీశాం.. ఓ వంద వ్యూస్ రాబట్టాం.. నాలుగు కాసులు సంపాదించాం అని కాకుండా వారిలో ఫ్యాషన్.. మేకింగ్ మీద వాళ్లకున్న ఇంట్రెస్ట్ కనిపించేలా ప్రాణం పెట్టి ఈ షార్ట్ ఫిల్మ్స్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కింది మనసానమః షార్ట్ మూవీ.

Raai Laxmi: బాబోయ్.. ఏంటీ రచ్చ రత్తాలు!

అలా మనసు పెట్టి తెరకేకించిన మనసానమః షార్ట్ మూవీ గత ఏడాదే యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ షార్ట్ మూవీకి ఇప్పటికే 900కు పైగా అంత‌ర్జాతీయ‌, రీజ‌న‌ల్ అవార్డ్స్ ల‌భించగా ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది. ఆస్కార్ అవార్డు అంటే సాధారణ విషయం కాదు.. ఎంతో మ్యాటర్ ఉంటే తప్ప అక్కడ వరకు వెళ్ళదు బొమ్మ. అలాంటిది ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ వరకు వెళ్లిందంటే సమ్ థింగ్ ఏదో స్పెషల్ ఉండే ఉండాలి. మరి అంత స్పెషాలిటీ ఇందులో ఏముందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Pushpa: ఫుల్ స్పీడ్ ప్రమోషన్లు.. పుష్ప ఫీవర్ తెగపెంచేస్తున్న సుక్కు!

మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ రివర్స్ స్క్రీన్ ప్లేలో సాగుతుంది. కంప్లీట్ లవ్ స్టోరీ అయిన ఈ ఫిల్మ్ రివర్స్ స్క్రీన్ ప్లేలో సాగుతుంది. ఎక్కడా ఫిల్మ్ సోల్ మిస్ కాకుండా దర్శకుడు దీపక్ రెడ్డి తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇరవై నిమిషాలలో రివర్స్ లో చెప్పి మెప్పించాడు. విరాజ్ అశ్విన్ అనే యువకుడు ఇందులో లీడ్ రోల్ లో నటించగా గ‌జ్జ‌ల శిల్ప ప్రొడ్యూస్ చేశారు. త‌మిళం, క‌న్న‌డంలో కూడా దబ్ చేసిన ఈ షార్ట్ మూవీకి అక్కడా మంచి ఆదరణే దక్కగా ఆస్కార్ ఓటింగ్‌లో కూడా ఈ సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని నమ్మకంతో ఉన్నారు.

Balakrishna: ఢీ అంటే ఢీ.. బాలయ్యలో ఇంతకు ముందెన్నడూ లేని జోష్!

ట్రెండింగ్ వార్తలు