The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో....

The Ghost: అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో అందరి చూపులు ఈ సినిమాపై పడ్డాయి. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ‘ది ఘోస్ట్’ అనే టైటిల్‌ను పెట్టి క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర యూనిట్.

Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్‌డేట్‌తో వస్తున్న ‘ది ఘోస్ట్’!

ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించి జూలై 9న ఫస్ట్ విజువల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చేతిలో ఓ కత్తి పట్టుకుని ఫెరోషియస్ లుక్‌లో నాగ్ కనిపిస్తున్న పోస్టర్‌ను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతుందని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో నాగ్ ఓ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Nagarjuna: ది ఘోస్ట్ – దుబాయ్‌లో ముగించేసిన నాగ్!

నాగ్ నుండి గతకొంత కాలంగా సరైన బ్లాక్‌బస్టర్ బొమ్మ రాకపోవడంతో, ఈ సినిమాను ఖచ్చితంగా సూపర్ హిట్ చేయాలని ‘ది ఘోస్ట్’ టీమ్ కసిగా ఉన్నారు. ఇక ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ది ఘోస్ట్’, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు