laknavaram Lake: ఇదేదో యూరప్ కంట్రీ కాదు.. మన లక్నవరం సరస్సే!

కంటికి కనిపించినంత దూరమంతా ఆకుపచ్చని చెట్లు.. మధ్యలో చేరిన వరద నీరు.. ఆ వరద నీటి మధ్యలో మూడు వైపులా వేలాడుతుండే కేబుల్ బ్రిడ్జ్.. ఇదేదో యూరప్ కంట్రీలా అనిపిస్తుంది.

laknavaram Lake: కంటికి కనిపించినంత దూరమంతా ఆకుపచ్చని చెట్లు.. మధ్యలో చేరిన వరద నీరు.. ఆ వరద నీటి మధ్యలో మూడు వైపులా వేలాడుతుండే కేబుల్ బ్రిడ్జ్.. ఇదేదో యూరప్ కంట్రీలా అనిపిస్తుంది. ఇప్పుడే చేరిన వరద నీరు కావడంతో నీళ్లు మట్టితో కలిసి ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ.. ఓ రెండు వారాల తర్వాత చూస్తే నీలి రంగులో మారిన నీళ్లతో ఈ లేక్ నిజంగా లండన్ లోనిదే అనుకోవచ్చు. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా.. మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలోని ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం చెరువే ఇది.

Big Boss 5: హౌస్‌లో ఫస్ట్ లవ్ స్టోరీ.. సిగ్గు మొగ్గలేస్తున్న ప్రియాంకా!

Laknavaram Lake

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు చెరువులు, కుంటలకు వరద పోటెత్తి నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఉయ్యాల వంతెన తోపాటు కాటేజీలలోకి నీళ్లు చేరాయి. లక్నవరం సరస్సులోకి భారీగా చేరిన వరద నీటితో సరస్సు జలశోభను సంతరించుకొని కనువిందు చేస్తున్నది. ప్రతి ఏడాది ఈ సమయానికి నిండు కుండలా నీటితో కనిపించే ఈ సరస్సు దాదాపు ఐదు నెలల పాటు ఇలా ఆహ్లాదంగా కనిపిస్తుంది.

Big Boss 5: జెస్సీ-అనీ మధ్య ఫైటింగ్.. చివరికి జెస్సీ కాళ్లబేరం

Laknavaram Lake

ఈ సమయంలో ఈ సరస్సును చూసేందుకు కేబుల్ బ్రిడ్జ్ మీద నడిచేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. జలకళ మొదలైనా గత రెండు రోజుల నుండి భారీ వర్షాల నేపథ్యంలో ముందుస్తు చర్యల్లో భాగంగా పర్యాటకులను అధికారులు అనుమతించడంలేదు. త్వరలోనే పర్యాటకులను అనుమతించే అవకాశం ఉండగా ఈలోగా నీళ్లు కూడా మట్టి రంగు నుండి తేరుకొని నీలి రంగులోకి మారనుండడంతో మరింత అందంగా కనిపించనుంది.

ట్రెండింగ్ వార్తలు