Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్

సాధారణ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను..మతపరమైన విద్యాసంస్థకు మార్చాలంటూ కొందరు వ్యక్తులు దుబాయ్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేయడం సంచలనంగా మారింది

Karnataka Uncertainty: కర్ణాటక రాష్ట్రంలో పలు విద్యాసంస్థల్లో తలెత్తుతున్న మతపరమైన వివాదాలకు ఇప్పట్లో తెర పడేలా లేదు. ఒకదాని తరువాత ఒకటి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. సాధారణ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను..మతపరమైన విద్యాసంస్థకు మార్చాలంటూ కొందరు వ్యక్తులు దుబాయ్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులు..ఇటీవల విద్యాసంస్థ నుంచి నిష్క్రమించారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలలో ‘శౌర్య శిక్షణ వర్గం’లో భాగంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఎయిర్ గన్‌లు, త్రిసూళ్ దీక్ష పట్టుకుని బజరంగ్ దళ్ కార్యకర్తలు శిక్షణ తీసుకున్నారు.

Other Stories:Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

అయితే ఆ శిక్షణ కార్యక్రమం సమయంలో పాఠశాలకు సెలవులు ఉన్నప్పటికీ..శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో పాఠశాలలో చదువుతున్న ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు..జారు గణపతి శనివారం స్పందిస్తూ..ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాన్ని సాకుగా చెప్పి ముగ్గురు ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలలను పాఠశాల నుంచి ఉపసంహరించుకున్నారని..వాస్తవానికి విద్యాసంస్థ లోపల ఎటువంటి శిక్షణా శిబిరం జరగలేదని స్పష్టం చేశారు. గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ అవసరాల కోసం విద్యాసంస్థ ఆవరణను వాడుకున్నారని..కానీ ప్రస్తుతం బజరంగ్ దళ్ నిర్వహించిన శిక్షణ శిభిరం పాఠశాల కాంపౌండ్ బయట జరిగిందని..అందులో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులుగాని, సిబ్బంది గానీ పాల్గొనలేదని సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Other Stories:Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!

మరోవైపు, ముగ్గురు ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులకు దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు ఫోన్ చేసి..తమ పిల్లలను ముస్లిం పాఠశాలలో చేర్పించాలని సూచించారని..ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడి నుంచి ఉపసంహరించుకున్నట్లు జారు గణపతి తెలిపారు. “పిల్లలను ముస్లిం పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు దుబాయ్ నుండి కాల్స్ వచ్చాయి మరియు వారు విరాజ్‌పేట నుండి బస్సు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మా వద్ద ముస్లిం ఉపాధ్యాయులు ఉన్నారు, ఇతర ముస్లిం విద్యార్థులు ఉన్నారు, కొత్తగా చేరిన మరికొందరు విద్యార్థులు ముస్లింలు కూడా ”అని జారు గణపతి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు