Bill from 1987: కిలో గోధుమలు రూ.1.6 మాత్రమే.. ఫొటో వైరల్

మార్కెట్లో కిలో గోధుమల ధర ఎంత ఉంటుంది? పేదవాడు కొనుక్కుని వాడలేనంత ఉంటుంది. ప్రస్తుతం దేశంలో గోధుమలతో పాటు అనేక సరుకుల ధరలు ఎంతగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇటువంటి సమయంలో కిలో గోధుమలు రూ.1.6 మాత్రమే అనే బిల్లు కనపడితే. అందరూ ఆశ్చర్యపోతారు. 1987లో దేశంలో గోధుమ పిండి ధర ఇది.

Bill from 1987: మార్కెట్లో కిలో గోధుమల ధర ఎంత ఉంటుంది? పేదవాడు కొనుక్కుని వాడలేనంత ఉంటుంది. ప్రస్తుతం దేశంలో గోధుమలతో పాటు అనేక సరుకుల ధరలు ఎంతగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇటువంటి సమయంలో కిలో గోధుమలు రూ.1.6 మాత్రమే అనే బిల్లు కనపడితే. అందరూ ఆశ్చర్యపోతారు. 1987లో దేశంలో గోధుమ పిండి ధర ఇది.

తాజాగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ అందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఓ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన బిల్లు ఇది. ‘‘అప్పట్లో గోధుమల ధర కిలోకు రూ.1.6 మాత్రమే. నా తాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1987లో విక్రయించారు’’ అని పర్వీన్ కాస్వాన్ చెప్పారు.

ఆ అధికారి తాత ‘జే ఫాం’ పేరిట గోధుమలను విక్రయించారు. రికార్డులు అన్నింటినీ క్రమబద్ధంగా నిర్వహించే అలవాటు తన తాతకు ఉందని వివరించారు. అప్పటి ధరలను, ప్రస్తుతం ఉన్న ధరలను పోల్చుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Delhi Anjali Case : ఢిల్లీ అంజలి కేసు.. ఆమె మృతికి కారణం ఇదే.. పోలీసుల చేతిలో అటాప్సీ రిపోర్ట్

ట్రెండింగ్ వార్తలు