IPL 2024 PlayOffs : ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లే ఆఫ్స్ స‌మ‌రం.. ముంబై మిన‌హా మిగిలిన అన్ని జ‌ట్ల‌కు అవ‌కాశం..!

ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జ‌ట్లు తీవ్రంగా పోటీప‌డుతున్నాయి.

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఇక ఈ సీజ‌న్‌లో లీగ్ ద‌శ ముగింపున‌కు చేరుకుంది. ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జ‌ట్లు తీవ్రంగా పోటీప‌డుతున్నాయి. ముంబై ఇండియ‌న్స్ మిన‌హా మిగిలిన అన్ని జ‌ట్ల‌కు ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే క‌నీసం 16 పాయింట్ల సాధించాల్సి ఉంటుంది. ఏ జ‌ట్టు ప‌రిస్థితి ఎలా ఉందో చూద్దాం..

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ..
పాయింట్ల ప‌ట్టిక‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచులు ఆడ‌గా 8 మ్యాచుల్లో గెలుపొందింది. ఆ జ‌ట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. మ‌రో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. క‌నీసం ఒక్క మ్యాచులో విజ‌యం సాధించినా కూడా ప్లే ఆఫ్స్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌..
పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచులు ఆడ‌గా 8 మ్యాచుల్లో గెలుపొందింది. ఆ జ‌ట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. మ‌రో మూడు మ్యాచులు ఆడాల్సి ఉండ‌గా.. ఒక్క మ్యాచులో గెలిచినా కూడా టాప్‌-4లో ఉంటూ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

SRH vs LSG : కాస్త క‌రుణించు వ‌రుణ‌దేవా.. మ్యాచ్ ర‌ద్దైతే స‌న్‌రైజ‌ర్స్ ప‌రిస్థితేంటంటే?

చెన్నై సూప‌ర్ కింగ్స్‌..
ప్ర‌స్తుతం చెన్నై పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. 11 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో గెల‌వ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. మ‌రో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. మూడు మ్యాచుల్లోనూ గెలిస్తే.. ఆ జ‌ట్టు ఖాతాలో 18 పాయింట్లు వ‌చ్చి చేరుతాయి. అప్పుడు ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌చ్చు.

అలా కాకుండా రెండు మ్యాచుల్లోనే గెలిస్తే అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్‌ర‌న్‌రేట్ కీల‌కం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. కానీ అప్పుడు మిగిలిన జ‌ట్ల గెలుపోట‌ముల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.

స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్‌..
పాయింట్ల ప‌ట్టిక‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నాలుగో స్థానంలో కొన‌సాగుఓతంది. 11 మ్యాచుల్లో 6 విజ‌యాలు సాధించిన ఆ జ‌ట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. మూడింటిలో విజ‌యం సాధిస్తే అప్పుడు 18 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆర్‌, కేకేఆర్‌, సీఎస్‌కేల‌తో క‌లిసి ఈజీగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లొచ్చు.

మూడు మ్యాచుల్లో రెండింటిలో గెలిచిన ప్లే ఆఫ్స్ కు చేరుకోవ‌చ్చు. అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 16 పాయింట్లు వ‌చ్చి చేర‌తాయి. నెట్‌ర‌న్ పై ఆధార‌ప‌డాల్సి రావొచ్చు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడింది. 6 మ్యాచుల్లో గెలిచింది. 12 పాయిట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో త‌ప్ప‌క విజ‌యం సాధించాలి. అప్పుడు ఆ జ‌ట్టు పాయింట్ల సంఖ్య 16కు చేరుకుంటుంది. అప్పుడు కూడా మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. నెట్ ర‌న్‌రేటు కూడా కీల‌కం కొవొచ్చు.

Sanju Samson : ఎవ‌రైనా అంపైర్‌తో వాగ్వాదం చేస్తే.. శిక్ష ఇలాగే ఉంటుంది.. సంజూకు బీసీసీఐ షాక్‌

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌..
పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. 12 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. ఇంకో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. మూడింటిలో గెలిస్తే అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 18 పాయింట్లు వ‌చ్చి చేర‌తాయి. అప్పుడు ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌చ్చు. అలా కాకుండా రెండింటిలోనే గెలిస్తే ఆ జ‌ట్టు ఖాతాలో 14 పాయింట్లు వ‌చ్చి చేరుతాయి. అప్పుడు మిగిలిన జ‌ట్ల గెలుపొట‌ముల‌తో పాటు నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కావొచ్చు.

ఆర్‌సీబీ, గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్‌..

ఇక ఆర్‌సీబీ, గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు అన్ని కూడా 8 పాయింట్ల‌తో ఉన్నాయి. ఈ జ‌ట్లు అన్ని మ‌రో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. అన్ని మ్యాచుల్లో విజ‌యాలు సాధించ‌డంతో పాటు త‌మ నెట్‌ర‌న్‌రేట్‌ల‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డం ఎంతో ముఖ్యం. అప్పుడు ఆ జ‌ట్ల ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. నెట్‌ర‌న్‌రేట్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది.

Daryl Mitchell : డారిల్ మిచెల్ ఎంత ప‌ని చేసావ‌య్యా.. వాళ్ల అమ్మ గ‌నుక చూస్తే వీపు విమానం మోతె..!

ముంబై ఇండియ‌న్స్‌..

ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 8 పాయింట్లు ఉన్నాయి. మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచినా ఆ జ‌ట్టు పాయింట్ల సంఖ్య 12 చేరుకుంటుంది. ఇప్ప‌టికే టాప్‌-6లో ఉన్న జ‌ట్ల‌లో కేకేఆర్‌, రాజ‌స్థాన్ ఖాతాలో 16 పాయింట్లు ఉండ‌గా మిగిలిన నాలుగు జ‌ట్ల‌ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. నాలుగు జ‌ట్లు కూడా దాదాపుగా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. క‌నీసం ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాటి పాయింట్ల సంఖ్య 14కి చేరుకుంటుంది. కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి ప్ర‌కారం ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌డం అసాధ్యం

ట్రెండింగ్ వార్తలు