Darshini : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘దర్శిని’ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా దర్శిని సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు.

Darshini : వికాస్, శాంతి జంటగా వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ LV సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో రాబోతున్న సినిమా దర్శిని. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చూడగలిగే టెక్నాలజీ కనిపెట్టి దాని వల్ల ఎదురైనా ఇబ్బందులు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read : Satya Dev : షూటింగ్ మొత్తం విజయవాడలోనే.. ఆ రేంజ్ క్యారెక్టర్స్ రావట్లేదు..

తాజాగా దర్శిని సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు. నిర్మాత డాక్టర్ LV సూర్యం మాట్లాడుతూ.. దర్శిని సినిమా సెన్సార్ వాళ్లకి నచ్చింది. యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మే 17న మా దర్శిని సినిమాని విడుదల చేస్తున్నాం. ముగ్గురు ఫ్రెండ్స్ కి భవిష్యత్తు చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు, పర్యవసానాలే ఈ సినిమా అని తెలిపారు.

డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ.. నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాకు చాలా సపోర్ట్ చేసారు. సినిమా చాలా బాగా వచ్చింది. మే 17న థియేటర్స్ లో వచ్చి దర్శిని సినిమా చూడండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో వికాస్, మిగిలిన మూవీ యూనిట్ పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు