Satya Dev : షూటింగ్ మొత్తం విజయవాడలోనే.. ఆ రేంజ్ క్యారెక్టర్స్ రావట్లేదు..

రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన సత్యదేవ్ కృష్ణమ్మ సినిమా మే 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Satya Dev : షూటింగ్ మొత్తం విజయవాడలోనే.. ఆ రేంజ్ క్యారెక్టర్స్ రావట్లేదు..

Satya Dev says Interesting Facts about Krishnamma Movie

Satya Dev : కొత్త కొత్త సినిమాలతో ఎలాంటి పాత్రైనా చేయగలిగే నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో హీరోగా దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ కృష్ణమ్మ తెరకెక్కింది. అథిరా, అర్చన, మీసాల లక్ష్మణ్, నందగోపాల్.. పలువురు ముఖ్య పాత్రలతో రివెంజ్ స్టోరీ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా మే 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సత్యదేవ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గోపాలకృష్ణ నిర్మాత కృష్ణ గారికి కథ చెప్పి ఓకే చేయించాకా శివ గారికి వినిపిస్తే నచ్చి ప్రజెంటర్ గా చేశారు. విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు కానీ అది కాదు అని చెప్పే కథే ఈ కృష్ణమ్మ. ఇది ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ జీవితాలు, వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్. అలాంటి డ్రీమ్ చెడగొడితే వీళ్ళు ఏం చేశారు అనేదే ఉంటుంది. సినిమా మొత్తం విజయవాడలోనే 60 రోజులు షూట్ చేసాము. అక్కడి విజయవాడ వాళ్ళు కూడా చాలా మంది నటించారు ఈ సినిమాలో అని తెలిపారు.

Also Read : Aadi Saikumar : దగ్గరుండి మ్యూజిక్ డైరెక్టర్‌తో.. గోవాలో వర్క్ చేయించుకుంటున్న హీరో..

సత్యదేవ్ ఈ సినిమాలో పాత్ర గురించి మాట్లాడుతూ.. వించిపేట భద్ర క్యారెక్టర్ కోసం, విజయవాడ స్లాంగ్, ఆ బాడీ లాంగ్వేజ్, కథలో కొన్నేళ్ల తర్వాత 40 ఏళ్ళ వ్యక్తిగా.. ఇవన్నీ కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్ క్యారెక్టర్. కృష్ణమ్మ రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నుంచి తీసుకొని ఫిక్షనల్ గా రాసిన కథ. సినిమాలో కొత్త సీన్స్ చాలా ఉంటాయి. కొరటాల గారు పెద్ద డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ లో ఎలాంటి ఛేంజ్ చెప్పకుండా ప్రజెంటర్ గా వచ్చి సినిమాకు సపోర్ట్ చేసారు అని అన్నారు.

Satya Dev says Interesting Facts about Krishnamma Movie

తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. నేను మొదట్నుంచి కొత్త కొత్త కథలే తీసుకుంటున్నాను. నా దగరికి చాలా కథలు వస్తున్నాయి. ఈ కృష్ణమ్మలో ఒక చిన్న క్రిమినల్ పాత్ర, తర్వాత ఫుల్ బాటిల్ అనే ఒక క్రైం కామెడీ, ఆ తర్వాత జీబ్రా, మెర్క్యురీ సూరి సినిమాలు ఇలా డిఫరెంట్ గానే చేస్తున్నాను. త్వరలోనే మరో రెండు సినిమాలు వస్తాయి అని తెలిపారు.

గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేసిన సత్యదేవ్ ఇప్పుడు ఆ పాత్రల గురించి మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లో చిరంజీవి గారికి ఆపోజిట్ గా చేశాను. రామసేతులో అక్షయ్ కుమార్ గారి పక్కన చేశాను. మళ్ళీ ఆ రేంజ్ పాత్రలు రావట్లేదు. హిందీ, తమిళ్ లో ఛాన్సులు వస్తున్నాయి కానీ మంచి పాత్ర కోసం చూస్తున్నాను. అలాంటి పాత్రలు వస్తే ఏ భాషలోనైనా చేస్తాను అని తెలిపారు. అలాగే నాయగన్ లాంటి సినిమా చేయాలి. కొత్త కొత్త గెటప్స్ వేసే పాత్రలు, చిరంజీవి గారి ఆపద్బాంధవుడు లాంటి సినిమా చేయాలని ఉన్నట్టు తెలిపారు సత్యదేవ్.