Flight Refuelling: ఎయిర్ ఫోర్స్ అవసరాల నిమిత్తం ప్యాసింజర్ విమానాలను ఇంధన సరఫరా విమానాలుగా మార్చనున్న భారత్

ఇప్పటికే వాడుకలో ఉన్న బోయింగ్ 767 ప్యాసింజర్ విమానాలకు కొద్దీ పాటి మార్పులు చేసి గగనతల ఇంధన వాహకాలుగా వినియోగించేలా భారత ప్రభుత్వం ఆలోచన చేసింది

Flight Refuelling: భారత వాయుసేన అవసరాల నిమిత్తం జెట్ విమానాలకు గగనతల ప్రయాణ మధ్యలో ఇంధనం నింపేందుకుగానూ అవసరమైన ఇంధన విమానాలను సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇంధన విమానాల సేకరణ కోసం గత కొన్నేళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలు కూర్చిన కేంద్ర ప్రభుత్వం..ఇపుడు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న బోయింగ్ 767 ప్యాసింజర్ విమానాలకు కొద్దీ పాటి మార్పులు చేసి గగనతల ఇంధన వాహకాలుగా వినియోగించేలా భారత ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈక్రమంలో దేశీయ విమానతయారీ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్యాసింజర్ విమానాలను ఇంధన వాహకాలుగా మార్చే పరిజ్ఞానం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(IAI)కే ఉంది.

Also read:china : డ్రాగన్ కంట్రీ కొత్త కుట్ర.. సరిహద్దుల్లో పవర్‌ గ్రిడ్‌ల హ్యాకింగ్ కు యత్నం

ప్యాసింజర్ విమానాలను ఆయిల్ ట్యాంకర్లుగా, కార్గో విమానాలుగా మార్చడంలో ప్రత్యేకత చాటుకుంది IAI. మల్టీ – మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ (MMTT) ఎయిర్‌క్రాఫ్ట్‌గా పిలిచే ఈతరహా విమానాలను ఇజ్రాయెల్ సంస్థతో కలిసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించనుంది. ఈమేరకు ఇజ్రాయెల్ సంస్థతో ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు HAL ప్రతినిధి ఒకరు బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహా భారత సైన్యంలో సేవలు అందిస్తున్న ఫైటర్ జెట్ విమానాలకు గగనతలం నుంచి గగనతలంలోనే ఇంధనం నింపేందుకు ఇప్పటివరకు ఆరు ఇంధన రవాణా విమానాలు అందుబాటులో ఉన్నాయి.

Also read:petrol, diesel price today :ఇంధన ధరల దూకుడుకు బ్రేక్.. గుంటూరులో మినహా..

2003లో రష్యా సహకారంతో తీసుకొచ్చిన ఆ విమానాలు తరచూ కాలాంతర మరమ్మతులుకు గురవుతున్నాయి. ఇక ప్రస్తుత తరుణంలో గగనతల ఇంధన వాహకాల అవసరం తప్పనిసరైన క్రమంలో ప్రభుత్వం మరో 6 ట్యాంకర్ విమానాలను సేకరించాలని నిర్ణయించింది. సాంప్రదాయ ఇంధన ట్యాంకర్ విమానాల ధరలతో పోల్చితే..ప్యాసింజర్ విమానాలను ఇంధన వాహకాలుగా మార్చడం ఖర్చు తక్కువతో కూడుకున్నది. దీంతో బోయింగ్ సంస్థ తమ విమానాల్లో వినియోగించే “KC-46 పెగాసస్” ట్యాంకర్ కు మార్పులు చేర్పులు చేస్తూ ఇంధన వాహక విమానంగా వాడనున్నారు. ఇక సరికొత్త గగనతల ఇంధన వాహకాలు అందుబాటులోకి వస్తే..భారత వాయుసేనలోని ఫైటర్ జెట్స్..నేలపై దిగకుండానే సుదీర్ఘ సమయంపాటు గగనతలంలో ఉంటూ సేవలు కొనసాగించవచ్చు.

Also read:Karnataka Hijab Row: యూనిఫామ్ విశిష్టత అల్ ఖైదాకు అర్ధంకాక పోవచ్చు కానీ భారతీయ ముస్లింలకు తెలుసు: అస్సాం సీఎం

ట్రెండింగ్ వార్తలు