Gods Warm In Winter అయోధ్యలో దేవుళ్లకు చలి వేయకుండా స్వెట్టర్లు, దుప్పట్లు..వేడి కోసం యంత్రాలు

అయోధ్యలోనే దేవాలయాల్లో దేవుళ్లకు చలినుంచి రక్షణ కోసం దుప్పట్లు, స్వెట్టర్లు ధరింపజేశారు. చలివల్ల దేవతామూర్తులకు నిద్రాభంగం కలుగకుండా వేడి గాలుల యంత్రాలను ఏర్పాటు చేశారు.

Gods Warm In Winter, Ayodhya Temple : శీతాకాలంతో చలి గజగజలాడిస్తోంది. బయటకు రావాలంటే స్వెట్టర్లు వేసుకోవాల్సి వస్తోంది. కానీ మనుషులకే చలి..దేవుళ్లకు చలి ఉండదా?అంటే ఎందుకుండదు? అందుకేగా దేవుళ్లకు కూడా స్వెట్టర్లు కప్పుతున్నాం అని చెబుతున్నారు అయోధ్యలోని దేవాలయ నిర్వాహకులు. భారత్ లో దక్షిణాదిలో కంటే చలి ఉత్తరాదిలో ఎక్కువగానే ఉంటుంది. అయోధ్యలోని ఆలయాల నిర్వహకులు. దేవతామూర్తులకు చలి వేయకుండా వెచ్చని దుస్తులతో కప్పి ఉంచారు. దేవుళ్లకు చలి వేయకుండా ఉన్నిదుస్తులు, దుప్పట్లు,శాలువాలు కప్పుతున్నారు.

Read more : దసరా వేడుక : వెండి మాస్కులు ధరించిన అమ్మవార్లు..

అయోధ్యలోని ప్రధాన ఆలయంతో పాటు శ్రీ రామ వల్లభ కుంజ్, కనక్‌ భవన్, హనుమాన్‌ గఢీ, నగేశ్‌ వార్నాత్‌ దేవాలయాల్లో దేవతల విగ్రహాలపై దుప్పట్లు, ఉన్ని దుస్తులు, శాలువాలు కప్పారు ఆలయ నిర్వాహకులు. ఈ వింత ఏర్పాటుపై రామ్‌లల్లా ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మాట్లాడుతు.. ‘అయోధ్యలో శ్రీరాముడు సహా దేవతా విగ్రహాలకు చలివేయకుండా దుప్పట్లు, ఉన్ని దుస్తులను కప్పుతున్నామని తెలిపారు. దేవతామూర్తులు నిద్రించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని..చలితో దేవాతామూర్తులకు నిద్రాభంగం కలుగకుండా ఉన్నిదుస్తులు కప్పుతున్నామని తెలిపారు.

Read more : 35kg Mask : ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. ఎందుకు? ఎక్కడ తయారుచేశారు.. ?

దేవుడి కోసం ఓ భక్తుడు రెండు దుప్పట్లను, స్వెటర్లను తయారు చేసి ఇచ్చారని తెలిపారు. రామ్‌లల్లాలోని తాత్కాలిక భవనంలో రామలక్ష్మణులను ఒక చోట, భరత-శత్రుజ్ఞులను మరో చోట నిద్రపుచ్చుతున్నామని తెలిపారు. దేవుడికి చలి వేయకుండా రాత్రంతా వేడిగాలి తగిలేలా యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ప్రతీ ఏడాది కూడా దేవతామూర్తులకు చలినుంచి రక్షణ కోసం ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

కాగా..కరోనా వచ్చిన ప్రారంభంలో దేవుళ్లకు మాస్కులు ధరింపజేసిన విషయం కూడా తెలిసిందే. భారత్ లోని పలు దేవాలయాల్లో దేవతామూర్తులకు మాస్కులు ధరించజేశారు.

ట్రెండింగ్ వార్తలు