Telangana BJP : బీజేపీకి వరుస షాక్‌లు..? ఏనుగు రవీందర్ రెడ్డి బాటలో మరికొందరు..! కేసీఆర్‌ను ఓడించడం కష్టమని..

Telangana BJP : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా బీజేపీ హైకమాండ్ శైలి ఉందని నేతలు అంటున్నారు.

Telangana BJP

Telangana BJP – Yennam SrinivasReddy : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ అధ్యక్షుడిని మార్చేసింది. కొందరికి కీలక పదవులు ఇచ్చింది. బండి సంజయ్ ను తప్పించి ఆ బాధ్యతలు కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఇక బీజేపీకి తిరుగులేదు, తెలంగాణలో దూసుకుపోతుంది అని హైకమాండ్ భావించగా.. గ్రౌండ్ లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అధ్యక్షుడి మార్పు అంశం పార్టీలో కలకలం రేపింది. బండి సంజయ్ ను పార్టీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని కొందరు రగిలిపోతుంటే, ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని మరికొందరు మండిపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీని వీడేందుకు కొందరు నాయకులు సిద్ధమైపోయారు.

Also Read..Eatala Rajender : నాకు పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం అదే- ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు. ఈటల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని బలంగా కోరిన వారిలో ఏనుగు రవీందర్ రెడ్డి ఒకరు. అయితే ఈటలకు ఆ పదవి దక్కకపోవడంతో ఆయన తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నారని సమాచారం.

ఒక్క ఏనుగు రవీందర్ రెడ్డే కాదు మరికొందరు కూడా కమలానికి కటీఫ్ చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట. ఏనుగు రవీందర్ రెడ్డి బాటలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, కాశిపేట లింగయ్య ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా బీజేపీ జాతీయ నేతల వ్యవహారాల శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నారట. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా బీజేపీ జాతీయ నేతల శైలి ఉందని నేతలు అంటున్నారు.

Also Read..Komatireddy Raj Gopal Reddy : జాక్ పాట్ కొట్టిన కోమటిరెడ్డి.. ఎట్టకేలకు కీలక పదవి

బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించడాన్ని రవీంద్ర నాయక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ ను మార్చడం వరకు ఓకే.. కానీ, కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటి? అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడుతున్నారు. ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇస్తే బాగుండేదని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న బీజేపీతో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదని ఈ నేతలు అంటున్నారు. అందుకే తమ దారి తాము చూసుకుంటాము అంటున్నారట.

ట్రెండింగ్ వార్తలు