Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

అందరూ అనుకున్నట్లు ఉంటే అది ‘అన్‌స్టాపబుల్’ ఎందుకవుతుంది?..

Unstoppable: నటసింహా నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ.. బాలయ్య హోస్ట్‌గా నెవర్ బిఫోర్ అనేలా సెలబ్రిటీ టాక్ షో ప్లాన్ చేశారు తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ టీం. ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు’.. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నామని ప్రోమోతో హింట్ ఇచ్చారు.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

బాలయ్య షో కి సెలబ్రిటీలు ఎవరెవరు రాబోతున్నారబ్బా అంటూ నెట్టింట బోలెడన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కట్ చేస్తే సస్పెన్స్‌కి తెరదించుతూ ఆదివారం ఉదయం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వదిలారు.

AHA 2.0: ఇది ఆరంభం మాత్రమే.. ఐకాన్ స్టార్ సమక్షంలో ఆహా సెలబ్రేషన్స్

విలక్షణ నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలెక్షన్ కింగ్.. డా.మంచు మోహన్ బాబు ఈ షో లో ఫస్ట్ గెస్ట్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు.

రామారావు నుండి నందమూరి ఫ్యామిలీతో మోహన్ బాబుకి అనుబంధం ఉంది. ఇక ఈ షో లో ఆయనతో పాటు కుమార్తె మంచు లక్ష్మీ, పెద్ద కుమారుడు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. అందరూ అనుకున్నట్లు ఉంటే అది ‘అన్‌స్టాపబుల్’ ఎందుకవుతుంది?.. ఊహించిన దానికంటే మరింత రసవత్తరంగా ఉందీ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో.
మోహన్ బాబుతో కలిసి బాలయ్య మామూలుగా సందడి చెయ్యలేదు. ‘దంచవే మేనత్త కూతురా’ అంటూ మంచు లక్ష్మీతో స్టెప్పులేశారు. బాలయ్య హోస్ట్ చేస్తే ఇంత సరాదాగా ఉంటుందా? అంటూ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు ప్రోమో చూసి. ఎపిసోడ్ మీద అంచనాలు అమాంతం పెంచేసింది ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో.

Nandamuri Balakrishna : బ్రహ్మణి గిఫ్ట్ ఇచ్చిన బెంట్లీ కార్‌లో బాలయ్య రాయల్ ఎంట్రీ..

బాలయ్య గెటప్ అదిరిపోయింది. రాయల్ లుక్‌లో ఉన్న నటసింహం పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, సెట్స్, ప్రాపర్టీస్ దగ్గరినుండి ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటూ బాలయ్య టాక్ షో నెవర్ బిఫోర్ అనేలా రూపొందిస్తున్నారు ‘ఆహా’ టీం. దీపావళి కానుకగా నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు