Uttarakhand Temples Closed : శీతాకాలం ప్రారంభం..య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాలు మూసివేత‌

శీతాకాలం ప్రారంభం కావటంతో ఉత్త‌రాఖండ్‌లోని హిమాయాల్లో ఉన్న య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను మూసివేశారు.

Uttarakhand Temples Closed : శీతాకాలం వచ్చింది. ఇక భక్తులకు హిమగిరి కొండల్లో కొలువైన స్వామి దర్శనాలు నిలిచిపోయాయి. శీతాకాలం ప్రారంభం కావటంతో ఉత్త‌రాఖండ్‌లోని హిమాయాల్లో ఉన్న య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను మూసివేశారు. శనివారం (నవంబర్ 6,2021) ఉద‌యం ఆల‌యాల‌ను స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన పూజారులు ఆలయాలను మూసివేశారు. ఉద‌యం 8 గంట‌ల‌కు కేదార్‌నాథ్‌, య‌మునోత్రి, గంగోత్రి ఆల‌యాల ద్వారాల‌ను పూజారులు మూశారు. శీతాకాలం పూర్తి అయ్యాక మంచు దుప్పటి కాస్త తెరిపి ఇచ్చాక మ‌ళ్లీ ఈ దేవాలయాలు ఆరు నెలల తరువాత చార్‌థామ్ యాత్ర‌కు సంబంధించిన ఆల‌యాలు తెరుచుకుంటాయి.

Read more : AP : పాపికొండల బోటింగ్…ఏర్పాట్లు పూర్తి

కాగా..కరోనా నేపథ్యంలో ఈ చార్ దామ్ యాత్రకు సంబంధించిన ఆలయాలు ఎక్కువ కాలం మూసివేసే ఉన్నాయి. కొన్ని రోజులు మాత్రమే తెరిచారు.ఈ క్రమంలో శీతాకాలం ప్రారంభం కావటంతో ఈ ఆలయాలను మూసివేశారు. ఈక్రమంలో నిన్న అంటే శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీ కేదార్‌నాథ్‌లో ప‌ర్య‌టించారు. జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఆ తరువాత మరుసటి రోజు అంటే ఈరోజు ఆలయాలను మూసి వేశారు.

Read more : SaiDharam Tej : ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను: సాయిధరమ్ తేజ్

శివుడికి అంకితం చేసిన కేదార్‌నాథ్ ఆలయం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరాలలో ఒకటి. గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో, మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ ఆలయం చార్ ధామ్.. ఉత్తరాఖండ్‌లోని పంచ కేదర్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి. సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉండి శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల ఈ ఆలయాన్ని సుమారు 6 నెలలపాటు మూసివేసి ఉంచుతారు.

ట్రెండింగ్ వార్తలు