Varalxmi Srathkumar : తెలుగు తెరపై కొత్త లేడీ విలన్.. వరుస సినిమాలతో బిజీ బిజీ..

సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హీరోయిన్ తో పాటు ముఖ్య పాత్రలు, విలన్ పాత్రలు కూడా.........

Varalxmi Srathkumar :  సినిమాలో హీరో ఎంత అవసరమో ప్రతి నాయకుడు కూడా అంతే అవసరం. అయితే కథలు మారుతున్న కొద్దీ లేడీ విలన్స్ కూడా వచ్చారు. అయితే లేడీ విలన్ పాత్రలు వేయడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అందులో తెలుగులో లేడీ విలన్ పాత్రలు వేసే వాళ్ళు చాలా అరుదు. అప్పుడెప్పుడో రమ్యకృష్ణ నీలాంబరిగా తన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఆ తర్వాత, ముందు లేడీ విలన్స్ ఉన్నా వాళ్ళు, వాళ్ళు చేసిన పాత్రలు అంతగా పేరు తెచ్చుకోలేకపోయాయి. అయితే తాజాగా తెలుగులో మరో లేడీ విలన్ దూసుకుపోతుంది.

సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హీరోయిన్ తో పాటు ముఖ్య పాత్రలు, విలన్ పాత్రలు కూడా వేయడం మొదలు పెట్టింది. తెలుగులో మొదటి సారి సందీప్ కిషన్ నటించిన ‘తెనాలి రామకృష్ణ బిఎ’ సినిమాలో విలన్ గా నటించింది. ఈ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా అందర్నీ మెప్పించింది. జయమ్మ క్యారెక్టర్ చాలా మందికి నోటెడ్ అయిపోయింది. ‘క్రాక్’లో రవితేజకి లేడీ విలన్ గా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఈ సినిమాతో తెలుగులో మరో పవర్ ఫుల్ లేడీ విలన్ దొరికేసినట్టే అని అందరూ భావించారు. ఆ తర్వాత ‘నాంది’ సినిమాలో లాయర్ గా కూడా విలక్షణ పాత్రలో తన నటనని చూపించింది.

Unstoppable with NBK : ‘లైగర్’తో అన్ స్టాపబుల్ అంటున్న బాలయ్య

మొన్నటి వరకు తమిళ సినిమాలు చేసిన వరలక్ష్మి ఇప్పుడు తెలుగులో బిజీ అవుతుంది. ఇప్పటికే బాలకృష్ణ 107వ సినిమాలో కూడా లేడీ విలన్ గా తీసుకున్నారు. సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’లో కూడా వరలక్ష్మి పవర్ ఫుల్ పాత్ర చేస్తుంది. మెగాస్టార్ 154వ సినిమాలో కూడా వరలక్ష్మిని తీసుకోబోతున్నట్టు సమాచారం. వీటితో పాటు తెలుగులో స్పోర్ట్స్ క్రైమ్ నేపథ్యంలో ‘ఆద్య’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో మెయిన్ లీడ్ గా కూడా చేయబోతుంది. ఇలా తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. మొత్తానికి ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ దొరికింది అని టాలీవుడ్ హ్యాపీ గా ఫీల్ అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో కచ్చితంగా లేడీ విలన్ గా అవకాశాలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు