Ghani: యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.....

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా పాండెమిక్ కారణంగా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశాయి.

Ghani : ‘గని’ కోసం రెండు రిలీజ్ డేట్స్!

ఈ క్రమంలోనే తాజాగా గని చిత్ర అఫీషియల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. తల్లి వారిస్తున్నా, బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాలనేది హీరో కల. తన కలను నిజం చేసుకునేందుకు గని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అతడు పడ్డ కష్టాలు.. వాటిని అతడు అధిగమించిన విధానమే ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు చిత్ర ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

ఇక గని పాత్ర కోసం వరుణ్ తేజ్ భారీ మేకోవర్‌ను చూపించాడు. రియల్ బాక్సర్‌లా కనిపించేందుకు అతడు జిమ్‌లో తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికి సంబంధించి గతంలో వీడియోలు కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో వరుణ్ తల్లి పాత్రలో నదియా నటిస్తుండగా, ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ మెయిన్ ప్లాట్ అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని, రొమాన్స్, ఎమోషన్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి.

Varun Tej: గని కూడా రెడీ అవుతున్నాడుగా!

ఈ చిత్రానికి థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా, అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ బ్యానర్లపై అల్లు బాబీ మరియు సిద్ధు ముద్ద సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. గని చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి గని చిత్రం వరుణ్ తేజ్‌కు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు