MS Dhoni : ఐపీఎల్‌లో ముగిసిన చెన్నై క‌థ‌.. ధోని ఏం చేస్తున్నాడో చూశారా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌థ ముగిసింది.

MS Dhoni bike ride : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌థ ముగిసింది. ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన సీఎస్‌కే ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేర‌కుండానే నిష్ర్క‌మించింది. ఈ క్ర‌మంలో దాదాపు రెండు నెల‌ల పాటు ఐపీఎల్‌తో బిజీగా గ‌డిపిన టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, సీఎస్‌కే స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోని త‌న స్వ‌స్థ‌లం రాంచీకి చేరుకున్నాడు. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన బైక్‌పై షికార్ల‌కు వెళ్లాడు.

శ‌నివారం బెంగ‌ళూరు వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డింది. ఈమ్యాచ్‌లో ధోని, జ‌డేజా పోరాడిన‌ప్ప‌టికీ చెన్నై 27 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేర‌క‌పోవ‌డంతో మ్యాచ్ ముగిసిన వెంట‌నే ధోని త‌న కుటుంబంతో క‌లిసి త‌న స్వ‌స్థ‌లం రాంచీకి ఆదివారం చేరుకున్నారు. ఇక సోమ‌వారం త‌నకు ఎంతో ఇష్ట‌మైన బైక్‌పై హెల్మెట్ ధ‌రించి షికారుకు వెళ్లాడు.

IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త.. ఆ డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేస్తార‌ట‌..!

అత‌డు య‌మ‌హా బైక్‌పై ఫామ్‌హౌస్‌లోకి తిరిగి వ‌స్తుండ‌గా ఓ అభిమాని తీసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సీజ‌న్‌లో ధోని 14 మ్యాచులు ఆడాడు. 220.55 స్ట్రైక్‌రేటుతో 161 ప‌రుగులు చేశాడు.

ధోని రిటైర్‌మెంట్ అవుతాడా..?

గ‌త కొన్నాళ్లుగా ధోని రిటైర్‌మెంట్ పై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఈ సీజ‌నే అత‌డికి ఆఖ‌రిది అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కు ధోని స్పందించ‌లేదు. త‌న రిటైర్‌మెంట్ పై ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ను చేయ‌లేదు. కాగా.. వ‌చ్చే ఏడాది మెగా వేలం జ‌ర‌గ‌నుంది. వేలానికి ఇంకా చాలా స‌మ‌యం ఉండ‌డంతో ధోని మ‌రో ఐపీఎల్ సీజ‌న్ ఆడ‌తాడా? లేదా? అనే దానిపై అప్ప‌టి వ‌ర‌కు ఓ స్ప‌ష్ట‌త రానుంది.

RCB vs CSK : బెంగ‌ళూరు వ‌ర్సెస్ చెన్నై మ్యాచ్‌లో మిస్ట‌రీ గ‌ర్ల్‌.. ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో..!

ట్రెండింగ్ వార్తలు