Rajya Sabha : వెంకయ్య నాయుడు కంటతడి, సభ్యుల ప్రవర్తనపై కలత

రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కంటతడిపెట్టారు. సభలో జరుగుతున్న పరిణామాల, ఎంపీల అనుచిత ప్రవర్తనతో ఆయన కలత చెందారు.

Vice President Venkaiah Naidu : రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కంటతడిపెట్టారు. సభలో జరుగుతున్న పరిణామాల, ఎంపీల అనుచిత ప్రవర్తనతో ఆయన కలత చెందారు. సభలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభింపచేయడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించాని వెల్లడించారు.

Read More :Bermuda Grass : గరిక గడ్డితో ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలిపెట్టరు!..

పార్లమెంట్ పవిత్రమైన దేవాలయం ? :-
2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం రాజ్యసభ 11 గంటలకు ప్రారంభమైంది. అయితే..ప్రతిపక్షాలు ఆందోళనలను కంటిన్యూ చేశాయి. గత కొన్ని రోజులుగా విఫక్షాలు కొన్ని అంశాలపై ఆందోళన చేపడుతుండడంతో సభా కార్యకలాపాలు జరగడం లేదు. దీంతో సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో..బుధవారం సభ ప్రారంభంగా కాగానే…ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కానీ కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read More :Huzurabad By Poll : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్

వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన ? :-
కొందరు టేబుళ్లపై కూర్చొన్నారు..మరికొందరు నిల్చొన్నారని తెలిపారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని, పరిణామాలు తలచుకుంటే..నిద్రపట్టే పరిస్థితి లేదని, చాలా దురదృష్టకరమైన పరిస్థితి అంటూ..కన్నీళ్లు పెట్టుకోవడంతో సభ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇన్ని రోజులు సభా కార్యకలాపాలు స్తంభింపచేయడం మంచిది కాదంటూ…సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

Read More :Wildfire: హృదయాన్ని కలచివేసే దృశ్యాలు.. మండుతోన్న అడవులు.. 42 మంది మృతి

మంగళవారం ఏమి జరిగింది ? :-

రాజ్యసభలో మంగళవారం రైతుల సమస్యపై చర్చించాలంటూ..ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే…కొందరు సభ్యులు నల్లని వస్త్రాలు ఊపుతూ..విసిరేస్తూ..తమ నిరసనలు తెలియచేశారు. చాలా మంది ఎంపీలు ఛైర్మన్ స్థానానికి దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట టేబుళ్లపైకెక్కి నిల్చొన్నారు. వాటిపై దాదాపు గంటసేపటికి పైగా…బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read More :పట్టాలెక్కనున్న రీజినల్ రింగు రోడ్డు పనులు

లోక్ సభ వాయిదా :-
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభ కూడా అదే సీన్ నెలకొంది. బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వరకు కొనసాగాల్సి ఉంది. అయితే..వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతూ వస్తున్నాయి. స్టార్టింగ్ నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో సభ వాయిదా పడతూ వస్తోంది. ప్రతిపక్షాల నేపథ్యంలో చర్చలకు ఆస్కారం లేనందున ముందుగానే…నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్స ఓం బిర్లా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు