Virat Kohli 28th Test Ton: కోహ్లి ఈజ్ బ్యాక్.. 6 నెలల్లో 5 ఇంటర్నేషనల్ సెంచరీలు.. ఫ్యాన్స్ ఫుల్ జోష్..

Virat Kohli 28th Test Ton: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో 75వ సెంచరీ సాధించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.

Virat Kohli 28th Test Ton: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో 75వ సెంచరీ సాధించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టుల్లో శతకం బాదడంతో కోహ్లి ఫ్యాన్స్ ఫుల్ జోష్ తో పండగ చేసుకుంటున్నారు. కోహ్లిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

అత్యంత వేగంగా 11,000 పరుగులు
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లి కీలక సమయంలో సెంచరీ చేశాడు. పట్టుదలతో ఆడి 241 బంతుల్లో 5 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో కోహ్లికి ఇది 28వ సెంచరీ. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానం కోహ్లిదే కావడం విశేషం. మూడు ఫార్మాట్లలోనూ కలిపి అతడి ఖాతాలో ఇప్పటివరకు 75 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 46, టీ20లో ఒక శతకం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో స్వదేశంలో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా కోహ్లి పేరిటే ఉంది.

సోషల్ మీడియాలో సందడి
మూడున్నరేళ్ల తర్వాత టెస్ట్ సెంచరీ సాధించడంతో కోహ్లి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కోహ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గణాంకాలను షేర్ చేస్తూ అతడిని పొగిడేస్తున్నారు. దీంతో #ViratKohli హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు.. దాదాపు 6 నెలల వ్యవధిలో 5 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడని నెటిజనులు గుర్తు చేస్తున్నారు. కోహ్లి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈమధ్య కాలంలో కోహ్లి సతీసమేతంగా చేసిన ఫూజలు ఫలించాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.


Also Read: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. స్వదేశంలో ఆ మైలురాయి దాటిన ఐదో ఆటగాడిగా ఘనత

ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు
ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లి ఘనమైన రికార్డు ఉందని అభిమానులు అంటున్నారు. మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఆసీస్ పై ఇప్పటివరకు 104 ఇన్నింగ్స్ లో 16 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు సాధించాడని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ లోనూ సెంచరీతో తన రికార్డు మరింత మెరుగుపరుచుకున్నాడు.

Also Read: వామ్మో ఇదేం కొట్టుడు.. 28బంతుల్లోనే 76 రన్స్. 10ఫోర్లు, 5సిక్సులు.. లేడీ సెహ్వాగ్ ఊచకోత

ట్రెండింగ్ వార్తలు