Rohit sharma And Ajit Agarkar
Rohit sharma – Ajit Agarkar : టీ20 వరల్డ్ కప్ -2024కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్ ఎంపిక కాకపోవటంతో చర్చనీయాంశంగా మారింది. వరల్డ్ కప్ టీంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ లను వికెట్ కీపర్, బ్యాటర్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. అంతేకాదు.. 15మంది ఆటగాళ్లలో రింకూ సింగ్ ఎంపిక కాకపోవడంతో సోషల్ మీడియాలో బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, వరల్డ్ కప్ జట్టులో కొందరు ఆటగాళ్లను పక్కన పెట్టడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు మీడియా సమావేశంలో వివరించారు. కేఎల్ రాహుల్ ను ఎందుకు ఎంపిక చేయలేదు? 15మంది ఆటగాళ్లలో రింకూ సింగ్ ను ఎందుకు చేర్చలేదో, అందుకు కారణాలను అగార్కర్ మీడియాకు వివరించారు.
Also Read : SRH vs RR : పోరాడి ఓడిన రాజస్థాన్.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం
కేఎల్ రాహుల్ ను టీ20 వరల్డ్ కప్-2024 జట్టులో ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, జట్టులో మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయగల బ్యాట్స్‌మెన్ అవసరం. రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో తన జట్టుకోసం ఓపెనింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, సంజు శాంసన్ బ్యాటింగ్ బాధ్యతలను నిర్వహించగలరని మేము భావించామని అగార్కర్ చెప్పారు. అదేవిధంగా రింకు సింగ్ ను ప్రపంచ కప్ జట్టు 15మంది సభ్యుల్లో ఎంపిక చేయకపోవడంపైనా అగార్కర్ క్లారిటీ ఇచ్చారు.
Also Read : SRH vs RR : రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల హంగామా చూశారా?
భారత్ తరపున టీ20ల్లో 89సగటు, 176.24 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసిన రింకూ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం మేం తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటని అగార్కర్ చెప్పారు. రోహిత్ శర్మకు మరిన్ని ప్రత్యామ్నాయాలను ఇవ్వడం కోసం నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశాం. రింకుకు అవకాశం దక్కకపోవడం దురదృష్టకరం. అతడు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. 15మందిలో ఉండడానికి అతడు ఎంత చేరువగా ఉన్నాడో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చునని అగార్కర్ చెప్పాడు.