WhatsApp Desktop Users : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు ఇకపై గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Desktop Users : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లకు అలర్ట్. వాట్సాప్ విండోస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ఒకటి వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు తమ గ్రూపులో నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

WhatsApp Desktop Users : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లకు అలర్ట్. వాట్సాప్ విండోస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ఒకటి వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ డెస్క్‌టాప్ (Whatsapp Desktop) యూజర్లు తమ గ్రూపులో నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. iOS లేదా Android యూజర్లకు (WhatsApp) మొబైల్ యాప్‌కు సమానమైన ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. WhatsApp కొత్త వెర్షన్ డెస్క్‌టాప్ యూజర్లు 8 మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్‌లను చేసుకోవచ్చు. అయితే, గరిష్టంగా 32 మంది యూజర్లతో ఆడియో కాల్‌లను చేసుకునేందుకు వాట్సాప్ అనుమతిస్తుంది. రాబోయే రోజుల్లో MAC వినియోగదారుల కోసం ఇదే విధమైన కొత్త ఫీచర్ రిలీజ్ చేయనుంది.

ప్రస్తుతం WhatsApp కొత్త Mac డెస్క్‌టాప్ వెర్షన్ బీటా టెస్టింగ్‌లో ఉంది. విండోస్ (Windows) ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కొత్త ఫీచర్లతో వచ్చిందని (Meta) ప్రకటించింది. విండోస్ యూజర్ల కోసం కొత్త WhatsApp యాప్‌ని ప్రవేశపెడుతున్నామని తెలిపింది. ఈ యాప్ వెర్షన్ అత్యంత వేగంగా లోడ్ అవుతుంది. యాప్ మొబైల్ వెర్షన్‌కు సమానమైన ఇంటర్‌ఫేస్‌తో వచ్చిందని నివేదిక తెలిపింది. వాట్సాప్ యూజర్లు గరిష్టంగా 8 మంది యూజర్లతో గ్రూపు వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గరిష్టంగా 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్‌లను చేసుకోవచ్చు. మీరు ఎల్లప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో కనెక్ట్ అయ్యేందుకు వాట్సాప్ అనుమతిస్తుందని నివేదిక తెలిపింది.

డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వీడియో, ఆడియో కాల్స్ చేయడం ఎలా? :
వాట్సాప్ విండోస్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా వీడియో, ఆడియో కాలింగ్ చేసుకోవచ్చు. తమ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. వాట్సాప్ అప్‌డేట్ చేసిన తర్వాత మీకు చాట్ బాక్స్‌లో ఆండ్రాయిడ్ లేదా iOSలోని (WHatsApp)లో కాల్ ఐకాన్ మాదిరిగానే కాల్ ఆప్షన్ (Call Option) కనిపిస్తుంది. యూజర్ల ప్రైవసీతో పాటు మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టాబ్లెట్‌ల మధ్య క్రాస్-ప్లాట్‌ఫారమ్ కమ్యూనికేషన్ సమయంలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. తద్వారా అన్ని చాట్ మెసేజ్‌లు ప్రైవేట్‌గా ఉంటాయి. పంపినవారు, రిసీవర్ మాత్రమే ఆయా చాట్ మెసేజ్‌లను చూడగలరు.

Read Also :WhatsApp Group Admins : వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు.. ఇక గ్రూపు అడ్మిన్లదే నిర్ణయం.. అన్ని గ్రూపులను ఒకే చోట చూడొచ్చు..!

వినియోగదారులు తమ వాట్సాప్ అకౌంట్‌ను ఇతర డివైజ్‌లతో ఏకకాలంలో కనెక్ట్ అయ్యేందుకు వాట్సాప్ అనుమతిస్తుంది. వినియోగదారులు తమ WhatsApp అకౌంట్లను మొబైల్, టాబ్లెట్, విండోస్‌లో కనెక్ట్ అయ్యేందుకు వీలుంది. మల్టీ-డివైజ్ సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు వాట్సాప్ మరిన్ని ఫీచర్లను డెవలప్ చేసే ప్రక్రియలో ఉంది. వాట్సాప్‌కు సపోర్టు చేసే డివైజ్‌ల సంఖ్యను పెంచే పనిలో ఉంది.

WhatsApp Desktop Users : WhatsApp now allows desktop users to make group video and voice calls

ప్రస్తుతం ప్రారంభ దశలో Android టాబ్లెట్‌లు, Mac డెస్క్‌టాప్‌ల కోసం కొత్త WhatsApp బీటా వెర్షన్ కూడా తీసుకొచ్చింది. వాట్సాప్ ఇటీవల గ్రూప్‌ల కోసం రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పుడు అడ్మిన్‌లకు మరింత కంట్రోల్ అందిస్తుందని, గ్రూప్ నావిగేషన్‌ను మరింత ఉపయోగకరంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ప్రకటించారు.

అడ్మిన్‌లకు మరింత కంట్రోల్ ఇవ్వడం ద్వారా షేర్డ్ గ్రూప్ ఇన్వైట్ లింక్‌ని ఉపయోగించి గ్రూప్‌లో ఎవరు జాయిన్ కావొచ్చు లేదో కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు గ్రూప్ అడ్మిన్‌లు ఎవరు చేరాలో, ఎవరు చేరకూడదో నిర్ణయించుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులను మరింత సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

రెండో గ్రూపులో యూజర్లు వేరొకరితో ఉమ్మడిగా ఉన్న గ్రూపులను చూసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులను కాంటాక్ట్ పేరు కోసం సెర్చ్ చేయడానికి వారి గ్రూపులను ఉమ్మడిగా చూసేందుకు అనుమతిస్తుంది. దాంతో వాట్సాప్ యూజర్లు గ్రూపులలో కాంటాక్టులను గుర్తించడం, కనెక్ట్ అవ్వడం చాలా సులభంగా ఉంటుంది. మీరు జాయిన్ అన్ని గ్రూపులను గుర్తించుకోవడం కష్టంగా ఉన్న పెద్ద గ్రూపులు, కమ్యూనిటీలలో ఈ ఫీచర్ అద్భుతంగా సాయపడుతుంది.

Read Also : Jio Airtel Plans : అత్యంత సరసమైన ధరకే జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ పోస్టుపెయిడ్ ప్లాన్లు.. మరెన్నో కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు