Bipin Rawat : నాడు మృత్యుంజయుడు.. స్వల్పగాయాలతో బయటపడ్డ బిపిన్ రావత్

భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 రకం హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు. సైనిక హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్‌

Bipin Rawat : భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 రకం హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు. సైనిక హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

అయితే, 2015లో ఇటువంటి హెలికాప్టర్‌ ప్రమాదమే బిపిన్‌ రావత్‌కు ఎదురైంది. ఆరేళ్ల క్రితం బిపిన్‌ రావత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో నాగాలాండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు మృత్యువును జయించిన బిపిన్‌ రావత్‌.. మరోసారి హెలికాప్టర్‌ ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ముందు తలవంచాల్సి వచ్చింది.

Mi-17V5 Chopper Crash : బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ భద్రతపై అనుమానాలు!

2015లో ఆయన లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉండగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బందితో కలిసి నాగాలాండ్ లో చీతా హెలికాప్టర్ ఎక్కారు. ఫిబ్రవరి 3న ఆ హెలికాప్టర్ దిమాపూర్ జిల్లాలోని రగ్బాపహార్ హెలిప్యాడ్ నుంచి గాల్లోకి ఎగిసింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగిరిన అనంతరం ఇంజిన్ నిలిచిపోవడంతో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో రావత్ తో పాటు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. అదే తరహాలో తాజాగా జరిగిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంలో మాత్రం బిపిన్‌ రావత్‌, ఆయన భార్య ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Army Chopper Crash : హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి

తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్ లోని రక్షణ రంగ కళాశాలలో ఉపన్యసించడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సీడీఎస్ జనరల్ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. కొద్దిదూరం వెళ్లగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో 13మంది(రావత్‌ దంపతులు సహా) దుర్మరణం చెందారు.

CDS(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, ఆర్మీ ఉన్నతాధికారులు తమిళనాడులోని వెల్లింగ్టన్ మిలటరీ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరారు. సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ల్యాండ్ అయ్యాక Mi-17-V5 ఆర్మీ ట్రాన్స్ పోర్టు హెలికాప్టర్ లో వెల్లింగ్టన్ బయలుదేరారు. మార్గమధ్యలో కూనూరు దగ్గర ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోయింది. మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

వాయుసేన, ఆర్మీ, నౌకదళ.. ఈ మూడింటికి చీఫ్ గా త్రివిధ దళాధిపతి(సీడీఎస్) ఉంటారని భారత ప్రభుత్వం 2019లో ప్రకటించింది. తొలి త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2022 జనవరితో ముగియనుంది. మిలటరీ వ్యవహారాలన్నీ సీడీఎస్ చూసుకుంటారు. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలటరీ అడ్వైజర్ గా వ్యవహరిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్మీ చీఫ్ స్థాయికి చేరుకున్న రావత్.. మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ గా వ్యవహరించారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా 2020 జనవరి 1 పదవీ బాధ్యతలు తీసుకున్నారు.

MI-17V-5 హెలికాప్టర్ ప్రత్యేకతలు..
* MI-17V-5 రవాణ హెలికాప్టర్ ను రష్యా(కాజన్ హెలికాప్టర్స్) తయారు చేసింది
* ప్రపంచంలోనే ఆధునిక రవాణ హెలికాప్టర్ గా పేరు
* ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో కలిసి 39మంది ప్రయాణించొచ్చు
* ఇందులో FLIR సిస్టమ్ తో పాటు ఎమర్జెన్సీ ఫ్లోటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి
* 4వేల 500 కిలోల బరువును మోసుకెళ్లగలదు
* S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలను కలిగుంది.

ట్రెండింగ్ వార్తలు