World Polluted Cities : ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీనే టాప్..!

ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలను వాయుకాలుష్య భూతం వెంటాడుతోంది. పలు నగరాల్లో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్య కాలుష్య తీవ్ర స్థాయికి చేరుకుంది.

World Polluted Cities  Delhi : ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలను వాయుకాలుష్య భూతం వెంటాడుతోంది. పలు నగరాల్లో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్య కాలుష్య తీవ్ర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ సమయంలో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. చలికాలంలో మంచుతో పాటు కాలుష్య తీవ్రత కూడా పెరిగింది. దాంతో వాయుకాలుష్య తీవ్ర ప్రభావాన్ని పలు నగరాలు ఎదుర్కొంటున్నాయి.  ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న టాప్ 10 నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కాలుష్యం ఎక్కువగా నగరాలుగా ముంబై, కోల్‌కతా నగరాలు చేరాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (IQA) కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. గాలి నాణ్యత, కాలుష్యాన్ని ఈ గ్రూప్‌ పర్యవేక్షిస్తుంది.  టాప్‌-10 కాలుష్య నగరాల జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు అనే సిటీలు ఉన్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యానికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా కాగా.. మరోవైైపు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కూడా ప్రధాన కారణాలుగా అధికార వర్గాలు వెల్లడించాయి. వాయుకాలుష్యానికి కారణమయ్యే ఈ వ్యర్థాల విషయంలో ఇరురాష్ట్రాల మధ్య వివాదాలు కూడా కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ప్రస్తుత గాలి నాణ్యత AQI 476గా నమోదైంది. వచ్చే 48 గంటలు కూడా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) హెచ్చరించింది. ఢిల్లీలో ఎప్పటిలానే రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేయాలని, వాహనాలను ‘బేసి-సరి’ విధానం అమలు చేయాలని సూచించింది. అలాగే నిర్మాణాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని CPCB పలు సూచనలు చేసింది. యూపీలోని బులంద్‌షహర్‌, మీరట్‌, హాపూర్‌, నోయిడా,  ఘజియాబాద్‌లోనూ AQI 400కు తీవ్రత పెరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌, అజ్మీర్‌, పుష్కర్‌, ఉదయపూర్‌, సహా 15 జిల్లాల్లో కాలుష్య తీవ్రత పెరిగింది.

CPCB ప్రకారం.. ఢిల్లీలో గాలిలో PM2.5 స్థాయి 300 మార్క్‌ను దాటేసింది. శుక్రవారం (నవంబర్ 12) సాయంత్రం 4 గంటలకు క్యూబిక్‌ మీటర్‌కు 381 మైక్రోగ్రాములగా నమోదైంది. గాలి నాణ్యత పెరగాలంటే PM2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములు ఉండాలి. ప్రస్తుతం 6 రెట్లు ఎక్కువగా వాయుకాలుష్యం నమోదైంది. వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఊపరితిత్తుల క్యాన్సర్‌, ఇతర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టాప్ 10 అత్యంత కాలుష్య నగరాలివే :
1. Delhi, India (AQI: 556)
2. Lahore, Pakistan (AQI: 354)
3. Sofia, Bulgaria (AQI: 178)
4. Kolkata, India (AQI: 177)
5. Zagreb, Croatia (AQI: 173)
6. Mumbai, India (AQI: 169)
7. Belgrade, Serbia (AQI: 165)
8. Chengdu, China (AQI: 165)
9. Skopje, North Macedonia (AQI: 164)
10. Krakow, Poland (AQI: 160)

Read Also :  PM Modi: మోదీకి గిఫ్ట్‌గా చీర.. మీరు చూశారా

ట్రెండింగ్ వార్తలు