Zika : కేరళలో జికా భయం, కర్నాటక రాష్ట్ర సర్కార్ అలర్ట్..మార్గదర్శకాలు జారీ

జికా వైరస్ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కేరళ రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కేసులు వెలుగు చూడడంతో పొరుగు రాష్ట్రాలు అలర్ట్ అయిపోయాయి. కేరళ రాష్ట్రానికి సరిహద్దులో ఉండే రాష్ట్రాలు నిఘా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ విస్తరించుకుండా..పలు చర్యలను చేపట్టింది.

Karnataka On High Alert : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. డెల్టా వైరస్ అన్నీ రాష్ట్రాలను భయపెడుతోంది. ఈ క్రమంలోనే..జికా వైరస్ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కేరళ రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కేసులు వెలుగు చూడడంతో పొరుగు రాష్ట్రాలు అలర్ట్ అయిపోయాయి. కేరళ రాష్ట్రానికి సరిహద్దులో ఉండే రాష్ట్రాలు నిఘా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ విస్తరించుకుండా..పలు చర్యలను చేపట్టింది.

Read More : Kukatpally : కూక‌ట్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్రమాదం

ఈ మేరకు 2021, జూలై 10వ తేదీ శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. దక్షిణ జిల్లాలైన కన్నడ, ఉడిపి, ఛామరాజనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, డా.కె.సుధాకర్ తెలిపారు. సరిహద్దులో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోందని, అర్బన్ వార్డుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి…నిఘా, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు ఇందులో పాల్గొనాలన్నారు.

Read More : Kaushik Reddy : టీఆర్ఎస్ లోకి హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి?

రాష్ట్రంలో వచ్చే టూరిస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గర్భిణీ స్త్రీలకు అల్ట్రా సౌండ్ చేసే సమయంలో, నవజాత శిశువుల్లో microcephaly ఉనికిని గుర్తించాల్సి ఉంటుందని తెలిపింది.  ప్రస్తుతం వర్షాకాల సీజన్ కొనసాగుతుందన్నందున జికా వైరస్ వ్యాధికి కారణంగా భావించే..Aedes mosquito నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మురుగు ప్రాంతాలు, నీటి నిల్వ ఉండకుండా..దోమలు వృద్ధి చెందకుడా పారిశుధ్యం నిర్వహించాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు