Moong Dal : రక్తపోటు నియంత్రణలో ఉంచటంతోపాటు, బరువు తగ్గటంలో తోడ్పడే పెసరపప్పు!

రక్తపోటును నియంత్రణలో ఉంచటంతోపాటు, రక్త శుద్ధికి పెసరపప్పు సహాయపడుతుంది. శరీరాలన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. త్వరగా జీర్ణం అవుతుంది. గుండె కు ఎంతో మేలు చేస్తుంది. పెసర గింజలని ఉడికించి తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ప్రోటీన్స్,మినరల్స్, విటమిన్స్ శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.

Moong Dal :

Moong Dal : పెసర పప్పు తో అనేక వంటకాలు చేస్తారు. సలాడ్, సూప్, చారు ఇలా రకారకాలుగా వంటకాలను చేసుకుని రుచికరంగా తీసుకుంటారు. శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రొటీన్లను పెసరపప్పు అందిస్తాయి. రోగనిరోదక శక్తి పెంపొందిచుకోవటంలో ఇవి బాగా ఉపకరిస్తాయి. పెసర పప్పులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్ బీ9, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బీ4 , ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ బీ2, బీ3, బీ5, బీ6 పుష్కలంగా ఉన్నాయి.

సాధారణంగా మొలకెత్తిన పెసర గింజలను తినటం వల్ల శరీరానికి ఎక్కవ మోతాదులో ప్రోటీన్స్, ఆమైనో ఆమ్లాలు, అందుతాయి. ఇవి అనేక వ్యాధుల బారి నుండి రక్షణ కలిగిస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు ఇలా పెసరపప్పుతో సూప్‌ను తయారు చేసి తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకుంటారు. పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి కలిగించే హార్మోన్లు ఎక్కువగా పనిచేయవు. ఎక్కవ సమయం పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న‌వారు పెస‌ర‌ప‌ప్పు తీసుకుంటే బ‌రువును సులభంగా తగ్గొచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు.

రక్తపోటును నియంత్రణలో ఉంచటంతోపాటు, రక్త శుద్ధికి పెసరపప్పు సహాయపడుతుంది. శరీరాలన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. త్వరగా జీర్ణం అవుతుంది. గుండె కు ఎంతో మేలు చేస్తుంది. పెసర గింజలని ఉడికించి తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ప్రోటీన్స్,మినరల్స్, విటమిన్స్ శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. పెసరపప్పు లో క్యాల్షియం అధికంగా ఉండటంతో ఇది ఎముకల దృఢత్వానికి చాలా మంచిది. పిల్లల ఎదుగుదల బాగుంటుంది. గుండె జబ్బు, రక్తపోటు,డయాబెటిస్,వంటి వ్యాధులు ఉన్న వాళ్లు,డైట్ లో కచ్చితంగా పెసరపప్పు చేర్చుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

పెసరపప్పు లో విటమిన్ బి,విటమిన్ సి,ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి చర్మ ఆరోగ్యానికి ఉపయోగ పడతాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచటంతోపాటు వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వకుండా కాపాడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలు కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు