Children Sleep : పిల్లలు రాత్రిళ్లు త్వరగా నిద్రించటం లేదా?

నిద్రకు ముందుగా పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, వారితో పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి.

Children Sleep : పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఇష్టపడరు. మధ్యమధ్యలో లేస్తుంటారు. తెల్లవారుజాముల్లోనే మేల్కొంటారు. వీటికి కొన్ని విషయాలు కూడా కారణాలు కావొచ్చు. చిన్నపిల్లల ఎదుగుదలకు తోడ్పడే ముఖ్యమైన అంశాల్లో నిద్ర కూడా ఒకటి. 5ఏళ్లలోపు చిన్నారులు రోజుకు 13 గంటల వరకు నిద్రించాలి. చిన్నారుల నిద్ర విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పెద్దలు ఎక్కువ సమయం మేలుకొని ఉంటే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. పెద్దలు త్వరగా నిద్రపోకపోవడానికి ఎక్కువ శాతం మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ కారణమవుతున్నాయి. దీనివల్ల పిల్లలు నిద్రకు దూరమవుతున్నారు. పిల్లలు, పెద్దలు ఇంట్లో ఒకేసారి నిద్రపోతే చాలా మంచిది. దీనివల్ల నిద్ర సమయం పెరిగే అవకాశం ఉంటుంది.

నిద్రకు ముందుగా పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, వారితో పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి. నిద్రపోయే ముందు టీవీ చూడడం, సోషల్‌ మీడియా వాడడం, వీడియోగేమ్స్‌ లాంటివి అసలు చేయకూడదు. ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణం ఉంటే నిద్రబాగా పడుతుంది. నిద్రించే ప్రాంతం పూర్తి చిమ్మచీకటి లేకుండా చూసుకోవటం మంచిది. కొద్దిపాటి వెలుతురు కలిగిన బెడ్ లైట్ వేయటం మంచిది. సమయం ప్రకారం చిన్నారులు నిద్రించటం వల్ల వారి ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు