Wearing Socks : రాత్రి సమయంలో సాక్స్ ధరించి నిద్రపోయే అలవాటుందా ? అయితే ఇన్ఫెక్షన్స్ ముప్పు తప్పదంటున్న నిపుణులు

ఎక్కువ సమయం సాక్స్ వేసుకుంటే పాదాలు బిగుతుగా మారి రక్తప్రసరణ తగ్గి తద్వారా రక్తపోటు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. బిగుతైన సాక్స్ కాళ్లకు ధరించి నప్పుడు గాలి ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి చెమట పడుతుంది.

sleep wearing socks

Wearing Socks : రాత్రి సమయంలో సాక్స్ ధరించి నిద్రించటం వల్ల నిద్రబాగా పడుతుందని చాల మంది బావిస్తారు. రాత్రి సమయంలో సాక్స్ ధరించటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి ఎక్కువ సేపు నిద్రపడుతుంది. ఈ అలవాటు చాలా మందిలో ఉంది. అయితే ఎక్కువ సేపు సాక్స్ ధరించే వారికి ప్రస్తుతం నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఎక్కువ సమయం సాక్స్ ధరించటం వల్ల శారీరక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

READ ALSO : Vyommitra : ఇస్రో సంధించే వ్యోమమిత్ర ఎవరో తెలుసా?

ఎక్కువ సమయం సాక్స్ వేసుకుంటే పాదాలు బిగుతుగా మారి రక్తప్రసరణ తగ్గి తద్వారా రక్తపోటు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. బిగుతైన సాక్స్ కాళ్లకు ధరించి నప్పుడు గాలి ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి చెమట పడుతుంది. తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలగటానికి ఆస్కారం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు సాక్స్ ధరించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగని ఎక్కువ సేపు వేసుకుంటే పాదాల్లో రక్తప్రసరణ సక్రమంగా జరగదు.

READ ALSO : Husband Kills Wife : వీడెవడండీ బాబూ.. భార్య నల్లగా ఉందని దారుణం, కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన భర్త

వైద్యులు సాక్స్ ధరించమని సలహా ఇస్తే తప్ప, నిద్ర సమయంలో సాక్స్ ధరించరాదు. ఒక వేళ ధరించాల్సి వచ్చినా బిగుతుగా ఉండే సాక్సుకు బదులుగా కాస్త ఒదులుగా ఉండే సాక్స్ ను ఎంపిక చేసుకోవాలి. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, గోర్ల అంచులను ఫంగల్ నెయిల్ ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ వల్ల గోరు రంగు మారి చర్మంలో నొప్పి, వాపు, చీము అసౌకర్యం కలుగుతుంది. సాక్స్ ధరించి నిద్రించే వారిలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అయితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.

READ ALSO : WhatsApp Hide IP : వాట్సాప్‌లో కాల్స్ సమయంలో మీ ఐపీ అడ్రస్ హైడ్ చేసుకోవచ్చు.. ఇక స్కామర్లు మీ లొకేషన్ ట్రాక్ చేయలేరు!

ముఖ్యంగా మధుమేహులు చాలా మంది కాళ్ళకు దెబ్బలు తగల కుండా సాక్సులు ధరిస్తుంటారు. అలాంటి వారు బయటకు వెళుతున్న సమయంలో ముఖ్యంగా అటు, ఇటు తిరుగుతన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే ఎక్కువ సమయం సాక్సులు ధరించటం వల్ల గోర్ల వద్ద ఇన్ ఫెక్షన్లు వచ్చి పుండ్లు పడే ప్రమాదం ఉంటుంది. చివరకు అవి మానకపోవటం, కాలు మొత్తానికి ఇన్ ఫెక్షన్ వ్యాప్తి చెందటం వల్ల ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

READ ALSO :Raja Singh: అవసరమైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

సాక్స్ ల వల్ల నెయిల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ పిల్లల కంటే పెద్దవారిలో ఎక్కువగా వస్తాయి. వృద్ధులకు రక్త ప్రసరణ తక్కువగా ఉన్నందున ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్లకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగుతుగా ఉండే సాక్స్ ధరించి రాత్రి సమయంలో నిద్రించటం ఏమాత్రం సరికాదని గుర్తుంచుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు